చంద్రబాబు ఉడుంపట్టు పట్టింది అందుకేనట…?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేసినా ముందు చూపుతోనే అని అంతా అంటారు. ఆయన ఇవాళా రేపు గురించి ఆలోచన చేయరు. మరికొంత కాలం తరువాత [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేసినా ముందు చూపుతోనే అని అంతా అంటారు. ఆయన ఇవాళా రేపు గురించి ఆలోచన చేయరు. మరికొంత కాలం తరువాత [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేసినా ముందు చూపుతోనే అని అంతా అంటారు. ఆయన ఇవాళా రేపు గురించి ఆలోచన చేయరు. మరికొంత కాలం తరువాత జరిగే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకునే వ్యూహ రచన చేస్తారు. ఆ విధంగా ఆలోచిస్తే ఏపీలో అసలు పరిషత్ ఎన్నికలు జరగనీయకుండా తెలుగుదేశం ఎంతలా ఉడుం పట్టు పట్టిందో అందరికీ తెలిసిందే. అలా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే దాని వెనక చాలానే కధ ఉందిట.
చిచ్చు దానితోనే..?
వీలైనంతవరకూ పరిషత్ ఎన్నికలను ఎక్కువ కాలమే వాయిదా వేయించాలని చంద్రబాబు చూశారు. అసలు గత ఏడాది స్థానిక ఎన్నికలు వాయిదా పడడానికి కారణం కూడా పరిషత్ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం కావడమే. అది ఏడాది సాగినా అలాగే చిచ్చు పెడుతూనే ఉంది. ఇక కోర్టు తీర్పుతో చివరి నిముషంలో పరిషత్ ఎన్నికలు జరిగాయి కానీ లేకపోతే వాటిని వాయిదా వేయించేందుకే చంద్రబాబు తనకు ఉన్న అనుభవాన్ని తిరగతోడి వ్యవస్థలను కూడా అడ్డం పెట్టుకుని ఎంత దూరం అయినా వేళ్ళేవారని అంటున్నారు.
అదీ మ్యాటర్ …
ఇక వచ్చే రెండు నెలల్లో అంటే జూన్ లో ఏకంగా పద్నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాబోతున్నాయి. వాటిలో అత్యధిక భాగం స్థానిక సంస్థల కోటా నుంచే భర్తీ కావాల్సి ఉంది. చూడబోతే పరిషత్ ఎన్నికల్లో టీడీపీకి సీట్లూ ఓట్లూ పెద్దగా వచ్చే సీన్ కనిపించడంలేదు. అదే సమయంలో వైసీపీకి మొత్తానికి మొత్తం పరిషత్తులు దక్కితే ఇక ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ నుంచే వస్తారు. దాని వల్ల మండలిలో ఒక్కసారిగా వైసీపీ బలం పెరిగిపోతుంది. దీంతోనే పరిషత్ ఎన్నికలు జరగకుండా చంద్రవ్యూహం పన్నారని అంటున్నారు.
పట్టు సడలింది…..
అయితే తెలుగుదేశం ఎంత బాయ్ కాట్ పిలుపు ఇచ్చిన మరెన్ని అస్త్రాలు ప్రయోగించినా కూడా పరిషత్ ఎన్నికలు సాఫీగానే జరిగిపోయాయి. దాంతో ఇక మీదట వైసీపీ ఎమ్మెల్సీలు అక్కడ నుంచే వస్తారు. దాంతో పాటు ఏపీలో పెద్దగా ఎన్నికలు కూడా లేవు. ఈ పరిణామాలతో టీడీపీ ఏ రకమైన కొత్త వ్యూహాలు రచిస్తుందో తెలియదు కానీ అసెంబ్లీలో నిండుగా బలమున్న జగన్ కి రేపు శాసనమండలిలో కూడా ఆధిక్యత దక్కితే మాత్రం ఆ జోరు వేరేగా ఉంటుంది. ఆ సంగతి తెలిసే చంద్రబాబు పరిషత్ ఎన్నికను పదమూడు నెలల పాటు బాగానే అడ్డుకోగలిగారు అంటున్నారు. మొత్తానికి బాబు టీడీపీ పట్టు మండలిలో సడలుతోంది. దానికి పరిషత్ ఎన్నికలే బీజం వేయడమే విశేషం.