బాబు ను దెబ్బకొట్టేందుకే బిజెపి వ్యూహం ?

తెలుగుదేశాన్ని కూకటివేళ్లతో పెకలించే ప్రక్రియకు బిజెపి శ్రీకారం చుట్టేసింది. ఏ పక్షం ఆ పార్టీ దరి చేరకుండా ఉండేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తూ చంద్రబాబు ఎత్తులకు [more]

;

Update: 2021-04-12 06:30 GMT

తెలుగుదేశాన్ని కూకటివేళ్లతో పెకలించే ప్రక్రియకు బిజెపి శ్రీకారం చుట్టేసింది. ఏ పక్షం ఆ పార్టీ దరి చేరకుండా ఉండేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తూ చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు కమలనాధులు. అందులో భాగంగా ఎప్పుడు జారిపోతుందో తెలియని జనసేన ను ఎక్కడికి వెళ్లనీయకుండా కట్టడి చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసింది కమలం. తమ సంప్రదాయాలకు భిన్నంగా కాబోయే సిఎం అభ్యర్థి పవనే అంటూ క్లారిటీ ఇచ్చేయడంతో చంద్రబాబు ఆశల పై నీళ్ళు చల్లినట్లు అయ్యిందంటున్నారు విశ్లేషకులు. బిజెపి ప్లస్ జనసేన కు తోడుగా ప్రభుత్వ మార్పు కోరుకునే వారందరు తమవైపు నిలబడతారాన్న కమలం లెక్కలే దీనికి రీజన్ అంటున్నారు.

చంద్రబాబు త్యాగం చేయాలా ?

వచ్చే ఎన్నికల్లో బిజెపి – జనసేన తో పొత్తుకు చంద్రబాబు సిద్ధపడాలి అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదులుకోవాలిసి వస్తుంది. దీనికి సుతారమూ ఆయన అంగీకరించే పరిస్థితి ఉండదు. ఒకవేళ గతిలేక ఒప్పుకుని ఫలితాలు వచ్చాకా అప్పటి సీట్ల లెక్కలను బట్టి చూసుకోవచ్చన్న ఎత్తుగడ ను బాబు అనుసరించే ధైర్యం చేస్తారా అంటే అదీ చేయక పోవచ్చంటు న్నారు. పవన్ కళ్యాణ్ పై తొలి నుంచి చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేసే నాయకుడిగా ఒక ముద్ర వైసిపి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. ఈ నేపథ్యంలో ఆ ముసుగు తొలగించుకునేందుకు పవన్ నానా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కమలం ఇచ్చే తాజా బంపర్ ఆఫర్ ఆయనకు టిడిపి కి నై అని చెప్పేందుకు పనికొచ్చే మంత్రమే కానుంది.

లోకేష్ కోసమే ఆలోచన …

తెలుగుదేశం పార్టీ భావి వారసుడు నారా లోకేష్ అన్నది అధినేత చంద్రబాబు గత ఐదేళ్లుగా చేస్తున్న ప్రొజెక్షన్. కానీ ఆయన మంగళగిరి లో ఓటమి తరువాత టిడిపి శ్రేణుల్లో లోకేష్ పేరు వినపడగానే నీరసం వచ్చేస్తుంది. ఆయన కన్నా బతికున్నంతకాలం చంద్రబాబే పార్టీకి నేతృత్వం వహించడమే మంచిదన్న వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం యువరక్తం అని పైకి చెబుతు లోకేష్ మంత్రం పఠిస్తున్నారు. ఈనేపధ్యంలో పవన్ నాయకత్వాన్ని ఆయన అంగీకరించడం ఇటు పార్టీలోనూ అటు ఇంట్లోను కూడా సాధ్యం అయ్యేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సాయం లేకుండా కమ్యూనిస్ట్ లనో కాంగ్రెస్ నో నమ్ముకుని మరోసారి పరాజయం మూటగట్టుకోవడమా లేక జగన్ కి చెక్ చెప్పడమే లక్ష్యం అనుకుంటున్న చంద్రబాబు నాలుగు మెట్లు కిందకు దిగి వస్తారా అన్నది ఆసక్తికరం అనే చెప్పాలి.

Tags:    

Similar News