బాబు ఆయన పేరే ఎత్తడం లేదే.. ఎందుకట ?
తిరుమల వెంకన్న సాక్షిగా బిజెపి ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వాసులకు హామీనిచ్చారు. ఆ తరువాత ఆయన ప్రధాని అయ్యారు. [more]
తిరుమల వెంకన్న సాక్షిగా బిజెపి ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వాసులకు హామీనిచ్చారు. ఆ తరువాత ఆయన ప్రధాని అయ్యారు. [more]
తిరుమల వెంకన్న సాక్షిగా బిజెపి ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వాసులకు హామీనిచ్చారు. ఆ తరువాత ఆయన ప్రధాని అయ్యారు. హామీ నీటి మీద రాతగా మారింది. 2014 నుంచి టిడిపి తో కలిసి ఉన్నా మోడీ తన మాటను నిలబెట్టుకోలేదు. దీనిపై వత్తిడి తీసుకురావలిసిన తెలుగుదేశం హోదా బదులు ప్యాకేజీ ముద్దు అంటూ స్లోగన్ తో ముందుకు పోయారు. ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయం గా నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తో యుగళ గీతం పాడారు చంద్రబాబు.
ధర్మపోరాటం అంటూ …
ధర్మ పోరాటం అంటూ 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మోడీ పై ఒంటికాలిపై లేచారు. ప్రధాని వ్యక్తిగత జీవితాన్ని సైతం టార్గెట్ చేస్తూ ఆయన ఎపి వాసుల సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మలేదు. ఫలితంగా వైసిపి కి అఖండ మెజారిటీ తో జగన్ అధికారం చేపట్టారు. ఆ తరువాత చంద్రబాబు మోడీ పై ధర్మపోరాటం కొనసాగించే ధైర్యం చేయలేకపోతున్నారు. అంతేకాదు ఆయనకు నమ్మిన బంటు లు గా పేరొందిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిని స్వయంగా చంద్రబాబు బిజెపి లోకి పంపేశారని ఆ పార్టీలో మొన్నటివరకు ఉన్న మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు వంటివారు నేరుగా ఆరోపణలు చేసినా నోరు మెదపలేదు బాబు అండ్ కో.
ఇప్పుడు తిరుపతిలో నో కామెంట్స్ …
తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే చంద్రబాబు టార్గెట్ అంతా వైసిపి నే. ప్రధాని మోడీని మాత్రం పల్లెత్తు మాట అనేందుకు మాత్రం ఆయన సాహసించకపోవడం గమనార్హం. గత ప్రభుత్వంలో దాదాపు నాలుగేళ్లు కలిసి అడుగులు వేసిన పార్టీ అప్పుడు చేయని పనిని జగన్ ఇప్పుడు చేయించలేకపోవడం వైఫల్యం గా చంద్రబాబు పస లేని ఆరోపణలు విమర్శలు సాగిస్తున్నారు. దీనిపై జనంలో పెద్దగా స్పందన రావడంలేదు కూడా. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే కేంద్రం లో మోడీ కి పూర్తి మెజారిటీ రావడంతో హోదా అంశం పై వత్తిడి తేవడం తప్ప మరేమి చేయలేమని చెప్పేశారు వైసిపి అధినేత. బిజెపి సర్కార్ వైసిపి పై ఆధారపడి ఉంటే హోదా అంశం చిటికెలో అయ్యే పని అన్నది ప్రజలకు అర్ధం అయిన విషయమే.
బాబు ఫోకస్ నాడు జగన్ బెయిల్ రద్దే …
టిడిపి ఎన్డీయే లో ఉన్నప్పుడు అదీ ఆ పార్టీపై ఎంతోకొంత బిజెపి ఆధారపడిన సమయంలో మోడీ చెప్పినట్లు విన్నది తప్ప పోరాట బాట పట్టలేదు. జగన్ బెయిల్ ను రద్దు చేసి లోపల వేస్తే చాలన్న లోపాయికారి లక్ష్యం తప్ప చంద్రబాబు కు మరో అజెండా లేకుండా పోయింది. ఇదే ఏపీ వాసులకు శాపంగా మారింది. మోడీ బాబు వీక్ నెస్ పసిగట్టి అటు హోదా ను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి జగన్ బెయిల్ విషయంలోనూ టిడిపి అధినేత కోరిక కూడా తీర్చకుండా రెండిటిలో అన్యాయమే చేసేసారు. అయితే ఇప్పుడు మాత్రం తనకు సాధ్యం కాలేని పనిని జగన్ సాధించాలని చంద్రబాబు కేంద్రంలో పూర్తి మెజారిటీ లో ఉన్న బిజెపి చేత చేయించాలనడం వింత వాదనగానే ఉందంటున్నారు విశ్లేషకులు.
హోదా వ్యూహం….?
అందుకే ఈ అంశం పై టిడిపి ఎంత రాద్ధాంతం చేసినా అది ముగిసిన అధ్యాయమే అని కేంద్రంలో సమయం అనుకూలించినప్పుడే హోదా సాకారం అవుతుందన్నది జనంలో క్లారిటీ వచ్చేసింది. దాంతో టిడిపి హోదా వ్యూహం బెడిసికొట్టేలాగే కనిపిస్తుంది. ఒక పక్క ప్యాకేజీ పాచి లడ్డులన్న పవన్ బిజెపి తో జతకట్టడంతో హోదా తేవాలిసిన బాధ్యత ఆయనపై మరింతగా పడినట్లే అయ్యింది. 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతా అన్నారు ఇప్పుడు అందరి మెడలు వంచుతున్నారని చంద్రబాబు విసురుతున్న పంచ్ లు పనికి రావన్నదే వైసిపి వర్గాల ధీమా. చూడాలి తిరుపతిలో వచ్చే తీర్పు తో అయినా చంద్రబాబు వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.