తిరుపతి ఎన్నికల తర్వాత బాబు స్ట్రాటజీ మారుతుందా ?
ఏపీలో అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీ మారుతుందా ? ఈ ఎన్నికల్లో [more]
ఏపీలో అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీ మారుతుందా ? ఈ ఎన్నికల్లో [more]
ఏపీలో అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీ మారుతుందా ? ఈ ఎన్నికల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాకపోతే ఖచ్చితంగా వైసీపీయే గెలుస్తుంది. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద సందేహాలు ఉండకపోవచ్చు. అయితే వైసీపీకి వచ్చిన మెజార్టీ, టీడీపీకి వచ్చిన ఓట్లు, జనసేన – బీజేపీ మధ్య ఓట్ల పోలరైజేషన్ వంటి అంశాలను బేరీజు వేసుకున్నాక చంద్రబాబు కొత్త స్ట్రాటజీలతో 2024 ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఆశించిన విధంగా 4-5 లక్షల ఓట్ల మెజార్టీ వస్తే చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఏం చేసేది ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా ఢీకొట్టాలా ? అన్న విషయంలో ఆయన ఎత్తులు, స్కెచ్‌ల కోసమే మరింత కష్టపడాలి.
అప్పుడే బలం….
ఒక వేళ వైసీపీ గత ఎన్నికల్లో వచ్చిన 2.28 లక్షల మెజార్టీయో లేదా అంతకంటే తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తే టీడీపీకి కాస్త మానసిక బలం ఉంటుంది. అదే వైసీపీ మెజార్టీ 2 లక్షల లోపుకు పడిపోతే టీడీపీ శ్రేణుల్లోనే కాదు.. చంద్రబాబులోనూ అచెంచలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇక పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కాపు / బలిజ వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. ఈ వర్గం ఓటర్లు ముందు నుంచి గతంలో టీడీపీ ఇప్పుడు ఎక్కువుగా జనసేన వైపే మొగ్గు చూపుతోన్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. వీరంతా బీజేపీకి ఓటేస్తారా ? లేదా వీరి ఓట్లు బీజేపీకి ట్రాన్స్‌ఫర్ కావా ? అన్న లెక్క బాబు పక్కగా చూసుకునే నెక్ట్స్ స్టెప్ వేసే అవకాశం ఉంది.
ఫలితాల తర్వాత…?
చంద్రబాబుతో పాటు రాజకీయ వర్గాల్లో జనసేన / కాపు వర్గాల ఓట్లు బీజేపీకి ట్రాన్స్‌ఫర్ కావనే అంటున్నారు. అదే జరిగి.. బీజేపీ ఈ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం / అత్తెసరు ఓట్లకే పరిమితం కావడం జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నెక్ట్స్ స్టెప్ జనసేనతో కలిసే ఉంటుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసే స్కెచ్‌లు అన్నీ ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే మొదలు అయిపోనున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేన + టీడీపీ పొత్తును మనం ఇప్పుడే ఊహించుకోవచ్చు. అలా కాని పక్షంలో కాపులు, పవన్ ఫ్యాన్స్ ఓట్లు భారీగా బీజేపీకి ట్రాన్స్‌ఫర్ అయితే బీజేపీ పవన్‌ను వదులుకుంటుందా ? అప్పుడు చంద్రబాబుఎత్తులు ఎలా ఉంటాయన్నది మాత్రం ఇప్పటకి అయితే సస్పెన్సే ? ఒక వేళ వైసీపీ లక్ష ఓట్ల లోపు మెజార్టీ లేదా అత్తెసరు మెజార్టీతో గెలిచినా… ఏదైనా పెద్ద సంచలనం నమోదు అయ్యి టీడీపీ గెలిచినా చంద్రబాబు వచ్చే ఎన్నికల వరకు పొత్తుల విషయంలో ఇప్పటి నుంచే ఆలోచించే పరిస్థితి అయితే ఉండదు.