బాబు.. త్రిమూర్తులు ఏమయ్యారు ?
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న, ప్రతిపక్షంపై సవాళ్లు రువ్విన ముగ్గురు కీలక నాయకులు ఏమయ్యారు ? [more]
;
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న, ప్రతిపక్షంపై సవాళ్లు రువ్విన ముగ్గురు కీలక నాయకులు ఏమయ్యారు ? [more]
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న, ప్రతిపక్షంపై సవాళ్లు రువ్విన ముగ్గురు కీలక నాయకులు ఏమయ్యారు ? ఇప్పుడు ఏం చేస్తున్నారు ? చంద్రబాబుకు అత్యంత విధేయులుగా పేరున్న ఈ ముగ్గురు కూడా.. రాజకీయంగా అంతే వేగంగా చక్రం తిప్పారు. వీరిలో ఒకరు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, రెండు ఏపీ రాజకీయాలపై ఢిల్లీలో గళం వినిపించిన కంభంపాటి రామ్మోహన్‌రావు, మూడు సిఆర్‌డీయే మాజీ ఉపాధ్యక్షుడు, మంత్రి పొంగూరు నారాయణ. గత బాబు హయాంలో నిత్యం మీడియాలో ఉన్న వీరు.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.
అత్యంత సన్నిహితుడిగా…?
కుటుంబరావు విషయానికి వస్తే.. ఆర్థిక శాస్తంబాగా తెలిసి, చార్టెడ్ అకౌంటెంట్‌గా పార్టీకి సేవలందించిన నేపథ్యంలో ఆయనకు చంద్రబాబు అనూహ్య పదవి ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనను ప్రణాళికా సంఘం అనే దానిని ఏర్పాటు చేసి మరీ.. ఉపాధ్యక్షుడిని చేశారు. అంటే.. కుటుంబరావు కోసం.. కొత్త పదవిని సృష్టించారు. ఐదేళ్లు బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత.. ఆయన పార్టీ కోసం అక్కరకు రాలేదు. ఆయన తనపనేదో తాను చేసుకుంటున్నారు. అయితే.. ఇటీవల చంద్రబాబు ఒత్తిడిపై.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విధానాన్ని తప్పు బడుతు.. ప్రభుత్వంపై ఒకటి రెండు విమర్శలు మాత్రం గుప్పించారు.
కేసుల వత్తిడితో….
ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇక, మాజీ మంత్రి పొంగూరు నారాయణ. చంద్రబాబు కలల రాజధాని అమరావతి బాధ్యతను నెత్తిన ఎత్తుకున్న ఈయన.. సీఆర్ డీయే వైస్ చైర్మన్‌గా కూడా చక్రం తిప్పారు. అయితే.. గత ఎన్నికల్లో పార్టీ తరఫున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి.. ఓడిపోయిన తర్వాత.. సైలెంట్ అయ్యారు. ఇటీవల సీఐడీ కేసులు నమోదు చేయడంతో.. తెరమీదకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా.. ఆయన కేవలం.. హైకోర్టులో పిటిషన్ వేసి ఊరుకున్నారు. రాజకీయంగా మాత్రం ఆయన బయటకు రాలేదు.
పదవి రాలేదనే…?
ఇక, కంభంపాటి రామ్మోహన్‌రావు. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్న నాయకుడిగా ఈయనకు పేరున్నా.. పార్టీ పదవులే తప్ప.. ప్రత్యక్ష పదవులపై ఈయన పెట్టుకున్న ఆశలు ఒక్కటి కూడా నెరవేరలేదని అంటారు. ఈ కారణంగానే ఆయన సైలెంట్ అయిపోయారు. తాజాగా గళం విప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కానీ, ఈ ముగ్గురికీ చంద్రబాబు ఎంతో ప్రియార్టీ ఇచ్చారని.. వారు మాత్రం ఆశించిన మేరకు పార్టీకి, చంద్రబాబుకు కూడా ఉపయోగపడడం లేదనే వాదన అయితే.. పార్టీ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.