వరస దెబ్బలతో బాబుకు రెస్ట్ కావాలా ?
చంద్రబాబు అంటేనే రాజకీయ చాణక్యుడు అని పేరు. ఆయన రాజకీయ అనుభవం నాలుగు దశాబ్దాల పై మాటే. అటువంటి బాబును అంతే వయసు ఉన్న ప్రత్యర్ధి గడగడలాడిస్తున్నాడు [more]
;
చంద్రబాబు అంటేనే రాజకీయ చాణక్యుడు అని పేరు. ఆయన రాజకీయ అనుభవం నాలుగు దశాబ్దాల పై మాటే. అటువంటి బాబును అంతే వయసు ఉన్న ప్రత్యర్ధి గడగడలాడిస్తున్నాడు [more]
చంద్రబాబు అంటేనే రాజకీయ చాణక్యుడు అని పేరు. ఆయన రాజకీయ అనుభవం నాలుగు దశాబ్దాల పై మాటే. అటువంటి బాబును అంతే వయసు ఉన్న ప్రత్యర్ధి గడగడలాడిస్తున్నాడు అంటే రాజకీయ ప్రారబ్దం అనుకోవాలేమో. జగన్ వయసు అంత అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడో జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలగాలి. కానీ టీడీపీలో ఆయన తరువాత అందుకు వచ్చే వారు లేకపోవడంతో పది మెట్లు దిగి వచ్చి మరీ జగన్ తో పోరాడుతున్నారు.
బ్యాడ్ రిజల్ట్స్ ….
సరే వయసుని అనుభవాన్ని అన్నీ మరచి మరీ జూనియర్ అయిన జగన్ తో పోరాడినా ఫలితం మాత్రం ఉండడంలేదు. జగన్ కి ఉన్న ప్రజా బలం ముందు చంద్రబాబు వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఇక జగన్ ముఖ్యమంత్రిగా తడబడతారు అని బాబు మొదట్లో అనుకున్నారు. కానీ రెండేళ్ల పాలన పూర్తి చేసి ముచ్చటగా మూడో ఏడులో జగన్ అడుగుపెడుతున్నారు. ఒక విధంగా చూస్తే జగన్ బాగా కుదురుకున్నట్లే. దానికి తోడు స్థానిక ఎన్నికలలో ఏకపక్ష విజయాలు జగన్ ని మరింత బలోపేతం చేశాయి. ఈ నేపధ్యంలో ఏ ఎన్నిక వచ్చినా వైసీపీదే విజయం అన్న పరిస్థితి ఏపీలో ఉంది. దాంతో ఈ పరాజయాల భారాన్ని లేటు వయసులో చంద్రబాబు అసలు తట్టుకోలేకపోతున్నారుట.
విదేశాలకేనా…?
చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నా కూడా ఏపీ మీదనే దృష్టి పెట్టాల్సి వస్తోంది. అదే సమయంలో పార్టీ నేతలు కూడా ఇదివరకు మాదిరిగా లేరు అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు చూపించిన విధేయత ఇపుడు లేదు అన్న మాట కూడా ఉంది. ఈ నేపధ్యంలో మరో మూడేళ్ళ వరకూ జగన్ని కష్టమైనా భరించడమే అన్న డెసిషన్ కి టీడీపీ అధినాయకత్వం వచ్చేసింది. ఇక హైదరాబాద్ లో ఉంటూ రోజూ రాజకీయ హైరానా పడే కంటే గాలి మార్పు కోసమైనా అమెరికా వెళ్ళి కొన్నాళ్ళు ఉండి రావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అంటున్నారు. పైగా అక్కడ బాబు ఆరోగ్య పరీక్షలు కూడా ఉన్నాయని అంటున్నారు. అలా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే శరీరానికి మనసుకు కూడా రిలీఫ్ లభిస్తుంది అని చంద్రబాబు భావిస్తున్నారుట.
బెస్ట్ డెసిషన్ …
మొత్తానికి లేట్ గా అయినా లేటెస్ట్ గా చంద్రబాబు తీసుకున్న డెసిషన్ బెస్ట్ అనే తమ్ముళ్లు కూడా అంటున్నారు. బాబు రెండేళ్ళుగా బిజీ అయిపోయి లేని పోని గందరగోళమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటున్నారు. చంద్రబాబు కనుక రెస్ట్ తీసుకుని వస్తే బుర్ర మళ్లీ పదునెక్కి జగన్ మీద పోరాటాలకు కావాల్సిన శక్తి వస్తుంది అని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వైసీపీ నేతలు కూడా కోరినట్లుగానే చంద్రబాబు రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది తాత్కాలికమేనని అంటున్నారు. మా చంద్రబాబు ఫుల్ ఎనర్జీతో తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతారు అని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.