బాబుకు అదృష్టం అదృశ్యమేనా ?
చంద్రబాబు మూడవసారి విపక్ష నేతగా పుట్టిన రోజును జరుపుకున్నారు. గతసారి కంటే నైరాశ్యం నిండా అలముకున్న వేళ ఈసారి చంద్రబాబు పుట్టిన రోజు సాదాగా జరిగింది. ఒక [more]
;
చంద్రబాబు మూడవసారి విపక్ష నేతగా పుట్టిన రోజును జరుపుకున్నారు. గతసారి కంటే నైరాశ్యం నిండా అలముకున్న వేళ ఈసారి చంద్రబాబు పుట్టిన రోజు సాదాగా జరిగింది. ఒక [more]
చంద్రబాబు మూడవసారి విపక్ష నేతగా పుట్టిన రోజును జరుపుకున్నారు. గతసారి కంటే నైరాశ్యం నిండా అలముకున్న వేళ ఈసారి చంద్రబాబు పుట్టిన రోజు సాదాగా జరిగింది. ఒక వైపు కరోనా కూడా విలయతాండవం చేస్తోంది. నిజానికి గత ఏడాది కూడా కరోన ఫస్ట్ వేవ్ ఉన్న వేళ బాబు బర్త్ డే జరిగింది. అయితే నాడు లోకల్ బాడీ ఎన్నికలు పెండింగులో ఉన్నాయి. వాటిలో గెలిచి సత్తా చాటవచ్చు అని చంద్రబాబు నాడు భావించారు. దాంతో అంతా ఆశావహంగా వాతావరణం ఉంది. గుర్రున ఏడాది తిరగకుండానే ఇంతలో అంతా జరిగిపోయినట్లు అయింది.
అలా జాక్ పాట్ మినిష్టర్….
చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని పూర్తిగా పరికించిన వారు అనే మాట ఒక్కటే. ఆయన తెలివైన రాజకీయ నాయకుడు అని. దానికి మించి అదృష్టవంతుడు అని. అది నిజమే అనిపిస్తుంది. నాడు అంజయ్య మంత్రి వర్గంలో ఏకంగా 78 మంది దాకా మంత్రులు అయ్యారు. అపుడు మంత్రి పదవుల భర్తీకి సీలింగ్ అంటూ ఏమీ లేదు. ఎంతమందిని అయినా చేసేయవచ్చు. అలా శాఖలు కూడా లేని వారు, సచివాలయంలో కుర్చీలు కూడా లేని వారు చాలా మంది మంత్రులు గా చలామణీ అయ్యారు. వారిలో చంద్రబాబు ఒకరు. అయితే ఆయనకు మంచి శాఖే దొరికింది. అదే సినిమాటోగ్రఫీ శాఖ. ఆయన అదృష్టం రింగ్ తొడుక్కుని పుట్టాడు కాబట్టే అలా మంత్రి అయ్యారు అని చెబుతారు.
అన్నగారికి అల్లుడాయే ..?
సీనియర్లకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తే అవమానంగా భావిసారు. కానీ చంద్రబాబు లాంటి రాజకీయ తెలివిడి కలిగిన వారికి ఆ శాఖ ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. నాటి అగ్ర నటుడు ఎన్టీయార్ తో డైరెక్ట్ గా రిలేషన్స్ పెట్టుకుని ఏకంగా ఆయన ఇంటికే అల్లుడు అయిన మేధావి చంద్రబాబు. ఆ విధంగా చూస్తే బాబుని అదృష్ట జాతకుడు అని అనకుండా ఎవరైనా ఉండగలరా. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అన్న వేళ సొంత మామ ఎన్టీయారే అధికారంలోకి వచ్చాడు. దాంతో అల్లుడు హోదాలో చంద్రబాబు సునాయాసంగా కొత్త పార్టీలో ప్రవేశించి టీడీపీ మీద మొత్తం పేటెంట్ హక్కులు లాగేసుకున్నారు.
కిందాపడ్డా…?
ఇక చంద్రబాబు ను స్వయం ప్రకాశం లేదని ప్రత్యర్ధులు అంటారు అది లేకపోతేనేమి ఎదుటి వారి వెలుగులను తన వైపు మళ్ళించుకుని అధికారాన్ని అందుకోవడంలో ఆయన దిట్ట. అందుకే నాడు కాదన్న వాజ్ పేయితోనే చేతులు కలిపి ఎన్డీయే కన్వీనర్ గా ఒక వెలుగు వెలిగారు వాజ్ పేయ్ సానుభూతితో ఏపీలో రెండవమారు అధికారంలో అధికారంలో వచ్చారు. ఇక ఏపీకి వస్తే అరెస్ట్ చేయిస్తాను అని తాను కట్టడి చేసిన మోడీతోనే జోడీ కట్టి 2014లో విడిపోయిన ఏపీకి ఫస్ట్ సీఎం అయ్యారు. ఇపుడు కూడా తలుపులు మూసుకుపోలేదు అన్నదే చంద్రబాబు విశ్వాసం. రాజకీయాల్లో మడి కట్టుకోవడాలు ఎంతటి వారికైనా కుదిరేది కాదు, అందువల్ల 2024లో బీజేపీ పవన్ తన దగ్గరకు వచ్చేలా పావులు జాగ్రత్తగా కదుపుతున్నారు. ఇక వైసీపీ జగన్ బలాన్ని కూడా తగ్గించేలా పధకాలూ వేస్తున్నారు. అయితే చంద్రబాబు బుర్ర నిండా ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా రాజకీయంగా ఆయన్ని ఇంతటి స్థాయికి తెచ్చిన అదృష్టం మరోసారి కలసి వస్తేనే ఆయన నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యేది. మరి బాబుకు ఈసారి కూడా లక్ కలిస్తే అదృష్ట జాతకుడు అన్న టైటిల్ ఆయనకే శాశ్వతంగా రాసిచ్చేయవచ్చు.