ఆ అర్హత చంద్రబాబుకు ఉందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు శాపంగా పరిణమించాయి. ఆయన జగన్ పై విమర్శలు చేసినా నాలుగు వేళ్లు చంద్రబాబువైపే [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు శాపంగా పరిణమించాయి. ఆయన జగన్ పై విమర్శలు చేసినా నాలుగు వేళ్లు చంద్రబాబువైపే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు శాపంగా పరిణమించాయి. ఆయన జగన్ పై విమర్శలు చేసినా నాలుగు వేళ్లు చంద్రబాబువైపే చూపేలా ఉన్నాయి. నిజానికి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు. తనకు తాను సీఈవోగా ప్రకటించుకున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటి నుంచే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు మూతపడ్డాయి.
సహకార వ్యవస్థను….
ప్రయివేటీకరణతోనే అభివృద్ధి అన్న నినాదంతోనే చంద్రబాబు గతంలో పనిచేశారు. ఇక డెయిరీల విషయానికి వస్తే చంద్రబాబు తన సొంత సంస్థ హెరిటేజ్ కోసం అనేక డెయిరీలను ముంచేశారన్న ఆరోపణలున్నాయి. చిత్తూరు, ఒంగోలు ఇలా ఒక్కటేమిటి హెరిటేజ్ దెబ్బకు అనేక డెయిరీలు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో డెయిరీలు మూతపడిన ఘటనలు కూడా ఉన్నాయి.
తప్పుకోవాలంటూ…..
ఇక సంగం డెయిరీ విషయానికొస్తే తొలినుంచి దూళిపాళ్ల నరేంద్ర కుటుంబం ఛైర్మన్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సంగం డెయిరీని దెబ్బతీయాలని చంద్రబాబు చూశారన్న విమర్శలున్నాయి. సంగం డెయిరీ పాలకవర్గం నుంచి తప్పుకోవాలని చంద్రబాబు ధూళిపాళ్ల నరేంద్ర పై వత్తిడి తెచ్చారంటారు. అయితే తమ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న సంగం డెయిరీ ఛైర్మన్ పదవిని వదులుకోవడానికి నరేంద్ర సిద్దపడలేదు.
మంత్రివర్గంలో…..
అందుకనే చంద్రబాబు ధూళిపాళ్ల నరేంద్ర కు మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదంటారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్రకు ప్రభుత్వంలో ఏ పదవి దక్కకపోవడానికి సంగం డెయిరీయే కారణమన్నది పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ డెయిరీ పై ఉన్న మక్కువ కారణంగా నరేంద్ర చంద్రబాబు డెయిరీ ఛైైర్మన్ పదవి నుంచి తప్పుకోలేదంటారు. ఇప్పుడ చంద్రబాబు జగన్ ను సహకారవ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని, అమూల్ ను తెచ్చి రాష్ట్ర డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేసినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. ఆయన విధానాలే ఆయన విమర్శలకు చెక్ పెడుతున్నాయి.