బాబు మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారా?
నెల్లూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ వచ్చే ఎన్నికల నాటికి కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తున్నట్టు పార్టీలో [more]
;
నెల్లూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ వచ్చే ఎన్నికల నాటికి కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తున్నట్టు పార్టీలో [more]
నెల్లూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ వచ్చే ఎన్నికల నాటికి కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. వీటిలో ఒకటి.. నెల్లూరు సిటీ, రెండు నెల్లూరు రూరల్. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఒకరకంగా చెప్పాలంటే.. వరుస ఓటములు చవి చూస్తోంది. నెల్లూరు సిటీ నుంచి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరుస విజయాలు సాధిస్తున్నారు. నెల్లూరు సిటీని తన కంచుకోటగా మార్చేసుకున్నారు.
రెండు నియోజకవర్గాల్లో…
ఇక, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా వరుస విజయాలు అందుకున్నారు. ఇద్దరూ వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే.. గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయోగాలు చేశారు. నెల్లూరు సిటీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణకు అవకాశం ఇచ్చారు. ఆయన మంత్రి హోదాలో ఉండి కూడా ఓటమిపాలయ్యారు. ఇక, అప్పటి నుంచి ఆయన పార్టీలోను, నియోజకవర్గంలోనూ ఎక్కడా కనిపించడం లేదు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ టికెట్ అడిగే అవకాశం ఉందని అంటున్నారు.
వైసీపీ నేత కుటుంబానికే…
ప్రస్తుతం ఇక్కడ తాత్కాలిక ఇన్‌చార్జ్ ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఓ యువ నాయకుడికి, పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఓ నాయకుడి కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతానికి భిన్నంగా చంద్రబాబు ప్రయోగం చేశారు. మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్‌కు ఇక్కడ టికెట్ ఇచ్చారు. కానీ, రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మైనారిటీ నేతకు అవకాశం ఇవ్వడంపై అప్పట్లోనే కేడర్ నుంచి వ్యతిరేకత వచ్చింది.
రెడ్డి సామాజికవర్గానికే..?
అయినప్పటికీ.. చంద్రబాబు.. వైసీపీ నుంచి వచ్చిన అజీజ్‌కు ప్రాధాన్యం ఇస్తే.. వైసీపీ ఓటు బ్యాంకు ఇటు వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ, ఇది విఫలమైంది. కానీ, కోటంరెడ్డికి అజీజ్ గట్టి పోటీనే ఇచ్చారు. గత 2014 ఎన్నికల్లో 25 వేల ఓట్ల మెజారిటీతో కోటంరెడ్డి విజయం సాధిస్తే.. గత 2019 ఎన్నికల్లో మాత్రం.. ఇది మూడువేలకు తగ్గిపోయింది. ఒకరకంగా.. అజీజ్ గట్టిగానే పోరాడారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను మార్చి.. ఆయనకు వేరే నామినేటెడ్ పదవి ఇస్తారని.. ఇక్కడ కూడా రెడ్డి వర్గం నేతకే టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే జిల్లా వైసీపీలోనే కాదు.. ఇటు టీడీపీలోనూ రెడ్డి నేతలే ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అందరు రెడ్లతోనే నెల్లూరు పార్టీని నింపేసే ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.