ఆ వృద్ధ నేతలకు చంద్రబాబు వెల్‌కమ్.. రీజనేంటి..?
రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి. ఇదీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్న పెద్ద వ్యూహం. అయితే.. ఇది ఎలా [more]
;
రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి. ఇదీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్న పెద్ద వ్యూహం. అయితే.. ఇది ఎలా [more]
రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి. ఇదీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్న పెద్ద వ్యూహం. అయితే.. ఇది ఎలా సాధ్యం ఇప్పుడున్న నాయకులతో పార్టీ భ్రష్టు పోయిందని ఆయన పూర్తిగా ఒక అంచనాకు వచ్చారు. పైగా తన మాటలకే విలువ లేదని.. గడిచిన రెండేళ్లుగా ఆయన చూస్తున్నారు. ఆయన తెప్పించుకున్న నివేదికల్లో కూడా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని స్పష్టమైంది.
వీరితో కలసి వెళితే…?
ఈ క్రమంలో ఇలాంటి నాయకులతో కలిసి పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కష్టమేనని చంద్రబాబు అనుకుంటున్నారు. అలాగని చూస్తూ.. నీళ్లు నములుతూ కూర్చుంటే.. రెండోసారి కూడా జగన్ సీఎం పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని నిశితంగా గమనించిన చంద్రబాబు.. ఇప్పుడు సరికొత్త ఐడియాతో ముందుకు వస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు.. తన బుర్రకు బాగా పనిచెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన స్కెచ్ ఏంటంటే.. గత ఎన్నికలకు ముందు.. అస్త్ర సన్యాసం చేసిన వారు, కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేదని రాజకీయంగా దూరంగా ఉన్న ప్రజాబలం ఉన్న నేతలను చంద్రబాబు దువ్వాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ లోని వృద్ధ నేతలను…
అదే సమయంలో వైసీపీలో ఉన్నప్పటికీ.. తమకు గుర్తింపులేదని అనుకుంటున్న వృద్ధ నేతలు. అదేసమ యంలో వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ రాదని.. డిసైడ్ అయిన యువ నేతలకు కూడా చంద్రబాబు ఆఫర్ ఇస్తున్నారని తెలుస్తోంది. “మీరు రండి. మీకు మంచి ఫాలోఅప్ చేస్తా. అదే సమయంలో మీ వారసులకు టికెట్లు ఇస్తా“ అని వృద్ధ నేతలకు, అదేసమయంలో“మీకు గుర్తింపు నేనిస్తా.. సైకిలెక్కండి“ అని యువ నేతలకు ఆయన ఆఫర్ ప్రకటిస్తున్నట్టు సమాచారం. ఇలా.. మొత్తం దాదాపు 50 మంది నేతలను పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట.
వ్యూహాత్మకంగానే?
ప్రస్తుతం ఈ విధానంపై చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని.. త్వరలోనే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభిస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే.. నిజానికి చంద్రబాబుపై కొపం ఉన్నా.. ఆయన పాలనకు చాలా మంది ఫిదా అవుతున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నా..తమకు గుర్తింపు లేదని భావిస్తున్నవారు కూడా ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.