బాబుకు అసలైన ట్రంప్ కార్డు అదేనట
చంద్రబాబు రాజకీయ గండర గండడు. ఆయన తిమ్మిని బమ్మిగా చేయగలడు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లుగా ప్రతీ సంక్షోభం నుంచి భవిష్యత్తుకు బాటకు వేసుకుంటారు. ఇదిలా ఉంటే ఇపుడు [more]
;
చంద్రబాబు రాజకీయ గండర గండడు. ఆయన తిమ్మిని బమ్మిగా చేయగలడు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లుగా ప్రతీ సంక్షోభం నుంచి భవిష్యత్తుకు బాటకు వేసుకుంటారు. ఇదిలా ఉంటే ఇపుడు [more]
చంద్రబాబు రాజకీయ గండర గండడు. ఆయన తిమ్మిని బమ్మిగా చేయగలడు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లుగా ప్రతీ సంక్షోభం నుంచి భవిష్యత్తుకు బాటకు వేసుకుంటారు. ఇదిలా ఉంటే ఇపుడు చంద్రబాబుకు రాజకీయంగా అసలు కలసిరావడంలేదు. బాబు తరఫున నోరు తెరవడానికి తమ్ముళ్లకు కూడా ధైర్యం చాలడంలేదు. జగన్ ఏలుబడిలో తమ్ముళ్లకు ఎక్కడికక్కడ నట్లు బిగించేస్తున్నారు. అంతే కాదు ప్రతీ నాయకునికీ జైలు దారి చూపిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగేది కాదని చంద్రబాబుకూ తెలుసు. అందుకే తమ పార్టీ మీద జగన్ రాజకీయ కక్ష కట్టారంటూ పెద్ద నోరు చేసుకుని ఎలుగెత్తి చాటుతారుట.
సింపతీ తోనే ….?
రాజకీయాల్లో సింపతీని మించింది లేదు. ఒక్క ఓటు తేడాతో పార్లమెంట్ లో ఓడారని దేశమంతటినీ కన్నీరు పెట్టించి మరీ మరిన్ని సీట్లు ఇచ్చి వాజ్ పేయిని రెండవ సారి ప్రధానిని చేసిన ఘనత సింపతీ కార్డుకు ఉంది. ఇపుడు అదే కార్డు తనకు కూడా కలసి వస్తునని చంద్రబాబు భావిస్తున్నారుట. అందుకే పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోమనండి అంటూ గట్టిగానే మాట్లాడారుట. బాబు ఆలోచన మేరకు జగన్ ఇంకా అరెస్టులు చేసుకుంటూ పోతారు. దాంతో ఆయన దూకుడే తమకు రాజకీయ పెట్టుబడిగా మారుతుందని, చివరికి జనాలు తమ వైపే టర్న్ అవుతారని కూడా అంచనాలు వేస్తున్నారుట.
ఇదే నినాదంగా…?
చక్కగా పాలన చేయమని జనాలు అధికారం ఇస్తే టీడీపీ నేతల మీద రాజకీయ కక్ష తీర్చుకుంటున్నాడు అంటూ జగన్ మీద విమర్శలు చేస్తూ జనాల్లోకి పోవాలన్నది చంద్రబాబు ప్లాన్ అంటున్నారు. ఇక ఎక్కడికక్కడ జిల్లాలలో నేతలు ఇదే అంశాన్ని మీడియా ఎదుట హైలెట్ చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారని టాక్. జగన్ రాజకీయ కక్షలకు దిగుతున్నాడు అన్నదే అజెండా చేసుకుని టీడీపీ ఎదురుదాడి చేయాలని కూడా బాబు స్పష్టమైన కార్యాచరణను తమ్ముళ్ళకు ఇచ్చారని చెబుతున్నారు. ఇది ఎంత జనాలలోకి బలంగా వెళ్తే అంత బలంగా టీడీపీకి పరిస్థితులు అనుకూలిస్తాయని కూడా చంద్రబాబు యోచిస్తున్నారుట.
ఇక జనంలోనే…?
వీలు అయితే కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తరువాత జగన్ మీద రాజకీయ దాడి చేయడానికి సభలు సమావేశాలు ఏ జిల్లాకు ఆ జిల్లాలో నిర్వహించడానికి కూడా టీడీపీ అధినాయకత్వం రెడీ అవుతోంది అంటున్నారు. జనాలు కూడా ఇలాంటి కల్చర్ ని సహించరని, దాని వల్ల మేధావులు, తటస్థుల మద్దకు కచ్చితంగా టీడీపీకి ఉంటుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారుట. మరి జగన్ బీసీ కార్డు, మైనారిటీ కార్డు అంటూ వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా జగన్ ఎన్ని కార్డులు తీసినా తాము వాడే సింపతీ కార్డే అసలైన ట్రంప్ కార్డు అవుతుందని బాబు భావిస్తున్నారుట. మరి చంద్రబాబు ఆశపడుతున్న సానుభూతి జనం నుంచి వస్తుందా. చూడాలి.