పుట్టుకతోనే పొలీటిషియన్ అయినట్లు?
రాజకీయ నాయకులు అంటే విమర్శలు సహజం. అదే సమయంలో ఎంతలా ఒకరిని ఒకరు నిందించుకున్నా ఎంతో కొంత ఎక్కడో అక్కడ హద్దులు ఉంటాయి. హుందాతనం కూడా విమర్శలు [more]
;
రాజకీయ నాయకులు అంటే విమర్శలు సహజం. అదే సమయంలో ఎంతలా ఒకరిని ఒకరు నిందించుకున్నా ఎంతో కొంత ఎక్కడో అక్కడ హద్దులు ఉంటాయి. హుందాతనం కూడా విమర్శలు [more]
రాజకీయ నాయకులు అంటే విమర్శలు సహజం. అదే సమయంలో ఎంతలా ఒకరిని ఒకరు నిందించుకున్నా ఎంతో కొంత ఎక్కడో అక్కడ హద్దులు ఉంటాయి. హుందాతనం కూడా విమర్శలు చేసేందుకు అడ్డు వస్తూంటుంది. కానీ ఏపీ రాజకీయాలు చూసుకుంటే అటు జగన్ ఇటు చంద్రబాబు మాత్రం పరస్పరం గౌరవించుకునే తీరే ఎక్కడా కనిపించదు. ఇద్దరికీ రెండోవారంటే చులకన భావమే. జగన్ విషయమే తీసుకుంటే చంద్రబాబు కు జనాల్లో ఆదరణ లేదని, ఆయన లక్కీగా సీఎం అయ్యారని భావిస్తారు. ఇక బాబు కోణం నుంచి చూస్తే జగన్ కి అసలు పాలన చేతకాదు, ఆయనను నాయకుడిగా కూడా అంగీకరించేందుకు చంద్రబాబు మనసు అంగీకరించదు అంటారు.
ఇదే మాట …
చంద్రబాబు తాను ఒకటి నమ్ముతారు. దాన్నే పదే పదే అంటూ జనాలను నమ్మించాలని చూస్తారు. ఆయన గత రెండేళ్ళుగా ఒకే మాట అంటున్నారు. జగన్ కి పాలన అసలు చేతకాదు అన్నదే చంద్రబాబు ప్రధాన విమర్శ. బాబు దేని మీద విమర్శించినా చివరికి జగన్ పాలన మీదనే రాళ్ళు వేస్తారు పాలించడం అంటే ఇదా అంటూ తూర్పార పడతారు. అక్కడికి తానేదో పుట్టుకతోనే అత్యుత్తమ పాలకుడిని అయినట్లుగా చంద్రబాబు వైఖరి ఉంటుంది. నిజమే బాబుతో పోలిస్తే జగన్ జూనియరే కావచ్చు. కానీ ఆయన రెండేళ్ల వ్యవధిలోనే బాగా కుదురుకున్నారు. ఇక చంద్రబాబు లాగానే జగన్ పాలించాలని ఏమీ లేదు. ఎవరి స్టైల్ వారిదే. మరి ఆ విషయం మాత్రం బాబు అంగీకరించరు. జగన్ కుర్చీ నుంచి దిగిపోవాల్సిందే అంటూ వీలైనపుడల్లా గగ్గోలు పెడతారు.
క్రేజ్ అంటే …?
ఇక జగన్ విషయానికి వస్తే చంద్రబాబుకు ప్రజాదరణ అసలు లేదని గట్టిగా నమ్ముతారు. చంద్రబాబు ఎంతసేపూ ఎత్తులతోనే రాజకీయం నడిపిస్తారు తప్ప స్వయం ప్రకాశి కాదని జగన్ ప్రగాఢ విశ్వాసం. అందువల్ల బాబుని అసలు ఖాతరు చేయాల్సిన అవసరమే లేదని జగన్ ఏనాడో మనసులో తీర్మానించేసుకున్నారు. అందుకే ఆయన చంద్రబాబు ఏ మాట అన్నా లైట్ గా తీసుకుంటారు. అసలు పట్టించుకోరు అంటారు. బాబుకు జనాదరణ లేదు అన్నది నిజమే అయినా ఆయన ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, అంతే కాదు రాజకీయాల్లో గెలుపునే ఎవరైనా చూస్తారు. ఏ విధంగా గెలిచారు అన్నది కొలమానం కాదు, ఆ విధంగా అలోచిస్తే బాబు గ్రేటే కదా. మరి చంద్రబాబు వ్యూహలను తెలివి తేటలను మెచ్చనక్కరలేదు కానీ సీనియర్ గా తన కంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా జగన్ గౌరవించాలి కదా అన్నది తటస్థుల భావన.
చులకన అవుతారు…
ఎవరైనా ఎదుటి వారిని గౌరవిస్తేనే ఆటోమెటిక్ గా తామూ గౌరవం పొందుతాము అని గుర్తుంచుకోవాలి. మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయం లేదు. అవి వ్యక్తిగతం దాకా రాలేదు కానీ ఏపీలో మాత్రం చాలా దారుణంగా చంద్రబాబు జగన్ ల మధ్య రాజకీయ సయ్యాట సాగుతోంది. దాంతో ఈ ఇద్దరు నేతలు తమకు తెలియకుండానే తాము పది మందిలో చులకన అవుతున్నారు అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం ఇద్దరు నేతలు కలసి పనిచేయాల్సిన వేళ ఇలా ఒకరిని ఒకరు చిన్నబుచ్చుకుంటే చివరికి అది రాష్ట్ర ప్రగతి మీద పడుతుంది. అంతే కాదు, ఏపీ రాజకీయాల విలువను కూడా తగ్గిస్తోంది. మరి ఇప్పటికైనా ఈ వాస్తవాలను ఇద్దరు నాయకులూ గ్రహిస్తారా.