బాబును నమ్మేదెలా.. సీనియర్లలో అంతర్మధనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజా సమస్యలపై ఆయన స్పందించి దాదాపు ఏడాదికి పైగానే అవుతుంది. [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజా సమస్యలపై ఆయన స్పందించి దాదాపు ఏడాదికి పైగానే అవుతుంది. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజా సమస్యలపై ఆయన స్పందించి దాదాపు ఏడాదికి పైగానే అవుతుంది. కేవలం ఎన్నికల సమయంలో తప్ప చంద్రబాబు సమస్యలపై క్షేత్రస్థాయిలోకి రారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లోకి రాకుంటే పార్టీ కోలుకోవడం కష్టమేనన్న పెదవి విరుపులు వినపడుతున్నాయి.
హైదరాబాద్ కే పరిమితం…
చంద్రబాబు గత ఏడాదిన్నరగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు లోటస్ పొండ్ లో ఉన్న జగన్ తనను విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్రేతరుడిగా కూడా జగన్ ను అన్నారు. ఆంధ్ర నిర్ణయాలు హైదరాబాద్ లో తీసుకుంటే ఎలా? అని అనేక సార్లు చంద్రబాబు ప్రశ్నించారు కూడా. కట్ చేస్తే చంద్రబాబుకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుంది. అయితే చంద్రబాబు కరోనా కారణంగానే హైదరాబాద్ కు పరిమితమయ్యారు. అప్పుడప్పుడు అమరావతి వచ్చి వెళుతున్నారు.
కరోనా లేకుంటే..?
నిజానికి కరోనా లేకుంటే చంద్రబాబు నిత్యం జనాల్లో ఉండేందుకే ప్రయత్నించేవారు. అది ఆయనకు అత్యంత ఇష్టం కూడా. ఇసుక వంటి సమస్యలపై కూడా ఆయన దీక్షలు చేశారు. వయసు రీత్యా ఆయన బయటకు రాకూడదని భావించి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం ఆయన బయటకు వచ్చారు. కరోనా ఉన్నప్పటికీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇది విమర్శలకు తావిస్తుంది.
ఎన్నికల ప్రచారానికి మాత్రం….
ఇప్పుడు కరోనా సమయంలో జూమ్ యాప్ లో ప్రభుత్వం పై విమర్శలు చేయడంపై సోషల్ మీడియాలో ప్రతికూల కామెంట్స్ వినపడుతున్నాయి. వయసు రీత్యా చంద్రబాబు బయటకు రాకపోవడమే మంచిది కాని, రాజకీయాలు చేయడానికి, ఎన్నికలప్పుడు ఆయనకు కరోనా గుర్తుకు రాదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే అయ్యన్న పాత్రుడు వంటి సీనియర్ నేతలు హైదరాబాద్ కే పరిమితమయితే పార్టీ బలోపేతం కావడం కష్టమేనని చేసిన వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు బయటకు రాకపోవడం తప్పుపట్టడం లేదు కాని, ఎన్నికలు వచ్చినప్పుడు రావడాన్ని అవకాశవాదంగా అంటున్నారు