టీడీపీ సీనియ‌ర్లలో తీర‌ని వేద‌న‌.. బుజ్జగింపుల‌కు లొంగుతారా ?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి రెండు ఘ‌ట‌న‌లు మ‌రింత వేద‌న క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎక్కడిక‌క్కడ కేడ‌ర్ కోల్పోవ‌డం పెద్ద స‌మ‌స్య అయితే.. ఉన్న సీనియ‌ర్లు.. అంటే.. దాదాపు [more]

;

Update: 2021-05-15 09:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి రెండు ఘ‌ట‌న‌లు మ‌రింత వేద‌న క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎక్కడిక‌క్కడ కేడ‌ర్ కోల్పోవ‌డం పెద్ద స‌మ‌స్య అయితే.. ఉన్న సీనియ‌ర్లు.. అంటే.. దాదాపు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నవారు.. గ‌తంలో చ‌క్రాలు తిప్పిన వారు ఇప్పుడు త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతుండ‌డం మ‌రో పెద్ద వివాదంగా మారింది. “మా స్థాయి వేరు. మేం చేసే రాజ‌కీయాలు వేరు“ అని వారు న‌ర్మగ‌ర్భంగా చెప్పుకొస్తున్నారు. అంటే.. టీడీపీలో త్వర‌లోనే కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటాయని, పార్టీ ఉపాధ్యక్ష ప‌ద‌వికి లోకేష్‌ను నామినేట్ చేసేందుకు.. చంద్రబాబు పావులు క‌దుపుతున్నార‌ని.. తెలుస్తున్న త‌రుణంలో సీనియ‌ర్లు తిరుగుబాటు బావుటా ఎగ‌రేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది.

లోకేష్ కు మరింత బాధ్యతను…

ఈ విష‌యం ఆనోటా.. ఈనోటా.. చంద్రబాబుకు చేరిపోయింది. ఆయ‌న కూడా క్షేత్రస్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించారు. ప‌లు నివేదిక‌లు తెప్పించుకున్నారు. ఇప్పుడున్న సీనియ‌ర్లలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంద‌రికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చార‌నే వారు.. కొంద‌రు మాత్రమే చంద్రబాబు వెంట ఉన్నార‌నేవారు.. ఇలా అనేక రూపాల్లో త‌మ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు నాయ‌క‌త్వాన్ని మాత్రమే వీరు కోరుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలోప్రత్యేకంగా జాతీయ‌ ఉపాధ్యక్ష కొలువు (ఇప్పటి వ‌ర‌కు లేదు) సృష్టించి.. త‌న బాధ్యతల్లో కొన్నింటిని లోకేష్‌కు అప్పగించేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నది మాత్రం వాస్తవం.

మహానాడులో…?

దీనికిగాను వ‌చ్చే నెల‌లో నిర్వహించే.. మ‌హానాడును వేదిక‌గా చేసుకున్నార‌ని కూడా అంటున్నారు. అంటే.. ఇప్పటి వ‌ర‌కు నెంబ‌ర్ 2 లేదా 3గా ఉన్న లోకేష్‌కు అప్పుడు మెజారిటీ బాధ్యత‌లు, అధికారాలు కూడా ద‌క్కుతాయి. దీనిని సీనియ‌ర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నే త‌మ దారి తాము చూసుకుంటామ‌ని.. కుదిరితే.. కాంగ్రెస్ లేదంటే.. బీజేపీ ఎలానూ ఉంద‌ని.. వారు అనేస్తున్నారు. ఎక్కువ మంది చూపు బీజేపీవైపు ఉన్నట్టు తెలుస్తోంది.

బుజ్జగిస్తూ…?

అయితే.. సీనియ‌ర్లే ఇప్పటి వ‌ర‌కు పార్టీకి అండ‌గా ఉన్నార‌ని భావిస్తున్న చంద్రబాబు వీరిని పార్టీ మార‌కుండా.. పార్టీలోనే కొన‌సాగించేలా.. అదే స‌మ‌యంలో త‌న కుమారుడి విష‌యంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమ‌లు చేసుకునేలా బుజ్జగించాల‌ని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రి మ‌హానాడు విష‌యానికి వ‌చ్చే స‌రికి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. ఈ ద‌ఫా మ‌హానాడులో లోకేష్ కీల‌కం కానున్నార‌నేది వాస్తవం అని అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాలే మీడియాకు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News