తిరుపతిలోనూ పరపతి పాయె

చంద్రబాబుకు రానున్న మూడేళ్ళు అసలు సిసలు అగ్ని పరీక్ష కాబోతోంది. చంద్రబాబు మొదటి రెండేళ్లూ దూకుడు రాజకీయం చేసి చాలా ఆయాసపడిపోయారు. జగన్ కుర్చీ ఎక్కగానే దిగిపో [more]

;

Update: 2021-05-03 02:00 GMT

చంద్రబాబుకు రానున్న మూడేళ్ళు అసలు సిసలు అగ్ని పరీక్ష కాబోతోంది. చంద్రబాబు మొదటి రెండేళ్లూ దూకుడు రాజకీయం చేసి చాలా ఆయాసపడిపోయారు. జగన్ కుర్చీ ఎక్కగానే దిగిపో అంటూ ఆయన చేసిన నానా యాగీ వల్ల జనాలు లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్ కి అపుడే వ్యతిరేకత వస్తుంది అని తప్పుడు అంచనాలు కట్టడంలొనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బోల్తా కొట్టారు. ఈ ఏడాది లోకల్ బాడీ ఎన్నికలతో మొదలుపెట్టి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక వరకూ వైసీపీ సాధించిన అప్రతిహత విజయాలు చంద్రబాబుకూ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చేశాయి. ఇక మిగిలింది బద్వేల్ ఉప ఎన్నిక. అది ఎటూ జగన్ సొంత ఇలాకా కడపలో జరిగే ఎన్నిక. కాబట్టి దాన్ని గురించి పెద్దగా ఆలోచించడం అనవసరం.

బిగ్ ప్రాబ్లం….

జగన్ వరసపెట్టి టీడీపీ నేతలను అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. ఇదే ఊపులో మరింతమంది నేతలు కూడా వైసీపీ సర్కార్ కి టార్గెట్ అవుతారు అన్న చర్చ ఉంది. ఇక రానున్న మూడేళ్ళూ పెద్దగా ఎన్నికలు ఉండవు కాబట్టి జగన్ సర్కార్ కి ప్రజామోదం లేదని నిరూపించే అవకాశం అయితే చంద్రబాబుకు చిక్కదు. దాంతో ఆయన జనంలో ఉండి ప్రజా సమస్యల మీదనే పోరాటం చేయాలి. ఆ దిశగా క్యాడర్ ని కూడా సమాయత్తం చేయాలి. ఈ లోగా పార్టీ నాయకులను కూడా కాపాడుకోవాలి. ప్రతీ ఓటమీ చంద్రబాబు మీద నమ్మకాన్ని ఎంతో కొంత తమ్ముళ్లకు తగ్గిస్తోంది అన్నది మాత్రం వాస్తవం.

గోడ దూకుళ్ళేనా ..?

ఇక ఇప్పటిదాకా ఏపీ పొలిటికల్ కధ ఒక ఎత్తు. ముందు ముందు మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుందని కూడా చెబుతున్నారు. జగన్ ఇక మీదట టీడీపీని గట్టిగానే వేటాడుతారు అంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మొదలుపెడితే బలమైన నేతలను కూడా తన వైపునకు తిప్పుకుంటారని కూడా అంచనాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితిల్లోనూ 2024 నాటికి టీడీపీకి బాగా బలహీనం కావాలన్నదే జగన్ అజెండాగా ఉంటుంది. ఆయన రాజకీయం ఆయనది కాబట్టి ఇందులో తప్పు పట్టాల్సింది లేదు. ఇది ఫక్త్ రాజకీయం కాబట్టి జనాల వద్దకు వచ్చి మొరపెట్టుకున్నా చంద్రబాబుకు వచ్చే సింపతీ కూడా ఏమీ ఉండదు. ఆయన వీటిని తనదైన రాజకీయంతోనే ఎదుర్కోవాలి. తమ పసుపు గంప కింద కోడి పిల్లలను వైసీపీ లాగేసుకోకుండా కాపాడుకోవాలి.

దక్షతకు సవాల్…?

ఏపీ రాజకీయాల్లో ఇన్నాళ్ళూ చంద్రబాబు వ్యూహాలు పనిచేశాయి, విజయాలు తెచ్చాయి. కానీ జగన్ ఎంట్రీతో ఆయన చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఇక అదే జగన్ సీఎం. పైగా ప్రజాకర్షణ కలిగిన నేతగా ఉన్నారు. ఆయన దూకుడుని తట్టుకుని మూడేళ్ళ పాటు పార్టీని నడిపించాలి అంటే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. టీడీపీ ఆర్ధిక మూలాలను పసిగట్టి మరీ పనిపడుతున్నారు జగన్. ఇక బలమైన నేతలను కూడా సైలెంట్ చేశారు. ఈ పరిస్థితుల్లో బాబు రోజూ జగన్ని తిడుతూ ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు గుమ్మంలోకి రాదు, చంద్రబాబు జగన్ ని మరచిపోయి ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఈ సమయంలో పార్టీలో తనతో కలసి వచ్చే వారిని ఏరుకుని మంచి టీమ్ ని తయారు చేసుకోవాలి. అంతే తప్ప జగన్ మీద వ్యతిరేకతో అధికారం దక్కుతుంది. పొత్తులతో నెగ్గుతాను అని లెక్కలేసుకుంటే మాత్రం మళ్లీ జగనే ఏపీకి సీఎం గా రావడం ఖాయం.

Tags:    

Similar News