ఓడినా.. పై చేయి నాదే అంటే ఎలా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశాజీవి. ఆయన ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడలో దిట్ట. తన మీడియాతో ఆ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తారు. తిరుపతి ఉప [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశాజీవి. ఆయన ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడలో దిట్ట. తన మీడియాతో ఆ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తారు. తిరుపతి ఉప [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశాజీవి. ఆయన ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడలో దిట్ట. తన మీడియాతో ఆ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తారు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు విశ్లేషణలు ఇలాగే కనపడుతున్నాయి. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వైసీపీపై తామే పైచేయి సాధించామని చెప్పుకుంటున్నారు చంద్రబాబు. ఇందుకు కారణం దొంగ ఓట్లేనట. దొంగ ఓట్లు కారణంగానే వైసీపీకి ఆ మాత్రం మెజారిటీ వచ్చిందని చంద్రబాబు చెబుతుండటం రాజకీయ విశ్లేషకులను సయతం ఆశ్చర్యపరుస్తుంది.
దొంగ ఓట్లు…..
దొంగ ఓట్లు వేయడం సాధ్యమా? ఒకవేళ వేసి ఉంటే ఎన్ని ఓట్లు వేసి ఉంటారు. లక్షల మంది వచ్చి క్యూలోనిలబడి, దొండ ఐడీ కార్డులు సృష్టించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓట్లు వేయడం సాధ్యమా? అన్నది కూడా చంద్రబాబు ఆలోచనలో లేదు. తిరుపతిలో వైసీపీ గెలుపు కేవలం దొంగఓట్ల కారణమేనంటూ ఆయన ముక్తాయింపు నివ్వడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రధానంగా తిరుపతి నియోజకవర్గ పరిధిలోనే ఈ దొంగ ఓట్ల ఆరోపణలు ఎక్కువగా విన్పించాయి.
అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చినా…?
అయితే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి మెజారిటీ యే వచ్చింది. కానీ చంద్రబాబు ఇందులో కూడా లొసుగులు వెతికారు. గత ఎన్నికలకంటే ఇప్పటి ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ తగ్గిందని చెబుతున్నారు. సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరులో వైసీపీ మెజారిటీ తగ్గిందని చంద్రబాబు అంటున్నారు. అలాగే తిరుపతి, శ్రీకాళహస్తిలో గతంలో కంటే ఓట్లు పెరగడానికి దొంగ ఓట్లు కారణమంటూ క్యాడర్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఉప ఎన్నికలన్న విషయాన్ని….
అయితే ఇక్కడ సాధారణ ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు వేరు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా తగ్గింది. సాధారణ ఎన్నికల్లో రాజకీయ పరిస్థిితి వేరుగా ఉంటుంది. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటుకు ఓటు వేయాల్సి ఉండటంతో ఖచ్చితంగా ఓట్లలో తేడా ఉంటుంది. క్రాస్ ఓటింగ్ అనేది తక్కువగా జరుగుతుంది. దీనిని కూడా ఆలోచించకుండా చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నాయి.