ఢిల్లీ నుంచి చల్లని వార్త… సాధ్యమవుతుందా?

చంద్రబాబుకు గత మూడేళ్ళుగా అంతా హాట్ హాట్ న్యూసే చెవిన పడుతోంది. 2018లో ఏ క్షణాన అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారో కానీ నాటి నుంచి చంద్రబాబుతో [more]

;

Update: 2021-05-20 14:30 GMT

చంద్రబాబుకు గత మూడేళ్ళుగా అంతా హాట్ హాట్ న్యూసే చెవిన పడుతోంది. 2018లో ఏ క్షణాన అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారో కానీ నాటి నుంచి చంద్రబాబుతో పాటు టీడీపీ పరిస్థితి మండు వేసవే అయింది. ఇక జగన్ చేతిలో వరస ఓటములు కూడా బాబుని బాగా కృంగతీస్తున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవకపోతే పార్టీ పుట్టె మునగడం, తనకు కంపల్సరీ రిటైర్మెంట్ ఖాయమన్నది బాబుకు తెలియనిది కాదు, ఇదిలా ఉంటే చంద్రబాబు బీజేపీతో పొత్తుకు గట్టిగా ట్రై చేస్తున్న సంగతి విధితమే. అయితే అక్కడ మోడీ, అమిత్ షాల నుంచే ప్రధాన అడ్డంకి ఎదురవుతోంది అంటున్నారు.

మోడీని కాదని…

బీజేపీని నడిపిస్తున్నది ఎవరూ అంటే మోడీ అనే సమాధానం వస్తుంది. అటువంటి మోడీకేఅయిదు రాష్త్రాలలో ఎన్నికల ఫలితాల తరువాత ఇపుడు పార్టీలో చెడ్డ రోజులు వచ్చేశాయని అంటున్నారు. వివాదాస్పద నేత, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అయితే మోడీని పక్కన పెట్టి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా నియంత్రణ బాధ్యతలు అప్పగించాలని తాజాగా డిమాండ్ చేయడం విశేషం. ప్రధానమంత్రి ఆఫీస్ కరోనా కట్టడి విషయంలో విఫలం అయింది అని స్వామి ఘాటుగానే కామెంట్స్ చేశారు. స్వామి లేవనెత్తిన ఈ డిమాండ్ ఆషామాషీది కాదు అనే చెప్పాలి. మోడీకి ఆల్టర్నేషన్ గడ్కరీ అని ఆయన నొక్కి చెప్పడమే కాదు, ఆయన కంటే కడు సమర్ధుడు అని కూడా ఫోకస్ చేయడమే స్వామి అసలైన వ్యూహమని చెబుతున్నారు.

అరెస్సెస్ అసంతృప్తి …

ఇక మోడీ చరిష్మా దేశంలో బాగా కరిగిపోయిందని ఆరెస్సెస్ గట్టిగానే భావిస్తోంది అంటున్నారు. నిజానికి మోడీ పనితీరు పట్ల 2019 కి ముందే ఆరెస్సెస్ కి అసంతృప్తి ఉందని చెబుతారు. అప్పటికే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి ద్వారా బీజేపీకి అనుకూలంగా ఉండే ఒక అతి పెద్ద సెక్షన్ ని మోడీ దూరం చేశారని గుర్రు మీద ఆరెస్సెస్ ఉందని ప్రచారం జరిగింది. నాడే కేంద్ర మంత్రి గడ్కరీని ప్రధాని అభ్యర్ధిగా ప్రమోట్ చేయలని భావించారు. కానీ మోడీ తనదైన రాజకీయ మంత్రాంగంతో అ గండం తప్పించుకున్నారని చెబుతారు. అ మీదట పుల్వామా దాడుల ఎమోషన్ బాగా వర్కౌట్ అయి బీజేపీ బంపర్ విక్టరీ కొట్టిందని విశ్లేషిస్తారు. ఇపుడు చూస్తే గడ్కరీ వైపే మళ్ళీ ఆరెస్సెస్ చూస్తోంది అంటున్నారు.

బాబుకే మేలు….

వచ్చే ఎన్నికల్లో మోడీ ఫేస్ తో వెళ్తే ఓట్లు రాలవని అర్ధమైన ఆరెస్సెస్ ఆలర్నేషన్ గా గడ్కరీని తెరపైకి తేవచ్చు అన్న ప్రచారం అయితే ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోతాయి. గడ్కరీతో చంద్రబాబుకు మంచి అనుబంధం ఉంది. పైగా ఆరెస్సెస్ పెద్దలను కూడా చంద్రబాబు ఇప్పటికే మంచి చేసుకున్నారు. దాంతో మరోసారి బీజేపీతో పొత్తు చిగురించడమే కాకుండా గడ్కరీ ని ముందుంచి ఏపీలో చంద్రబాబు జగన్ ని ఢీ కొట్టేందుకు ఎక్కువగా స్కోప్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News