ఇంతకీ ప్రజలకు ఎవరు రక్ష… ఎవరికి కక్ష…. ?
పాలకుడు అంటే ప్రజలను రక్షించేవాడు అని అంటారు. నాధుడు అని కూడా నాయకుడిని సంభోధిస్తారు. ఆ విధంగా చూస్తే ప్రజా సేవకులకు కొదవ లేదు కానీ అతి [more]
;
పాలకుడు అంటే ప్రజలను రక్షించేవాడు అని అంటారు. నాధుడు అని కూడా నాయకుడిని సంభోధిస్తారు. ఆ విధంగా చూస్తే ప్రజా సేవకులకు కొదవ లేదు కానీ అతి [more]
పాలకుడు అంటే ప్రజలను రక్షించేవాడు అని అంటారు. నాధుడు అని కూడా నాయకుడిని సంభోధిస్తారు. ఆ విధంగా చూస్తే ప్రజా సేవకులకు కొదవ లేదు కానీ అతి ఎక్కువైపోయే ఇపుడు ప్రమాదంగా మారుతోందిలా ఉంది. ఏపీలో ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరికీ కూడా జనాలంటే వల్లమాలిన అభిమానమే. ప్రజా సేవలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పద్నాలుగేళ్ళు తరిస్తే జగన్ రెండేళ్ళ సీఎం గా ఉన్నారు. ప్రజల యోగ క్షేమాలను చూడాలన్న ఆరాటం విషయంలో ఎవరినీ అనుమానించాల్సిన అవసరమే లేదు. అయితే ఆ మధ్యలో చొరబడిపోయిన రాజకీయమే అసలు కధను మార్చేస్తోంది.
కక్ష తీర్చుకుంటున్నారా..?
ఈ మాట వైసీపీ మంత్రులు ఇతర పార్టీ నాయకుల నుంచి ఎన్నోసార్లు ఇప్పటికి వినిపించింది. తనకు ఓటేయలేదని జనాల మీద చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని, అందుకే ఆయన రాజకీయం చేస్తున్నారు అంటూంటారు మంత్రులు. ఈ రెండేళ్లల్లో బాబుని ఈ విధంగా కూడా తిట్టవచ్చు అని వైసీపీ నేతలు నేర్చుకున్న విషయంగా చూడాలి. ఇక చంద్రబాబు ఏ మాట అన్నా ఏ సూచన చేసినా కూడా ఆయన జనాలకు చేటు చేస్తున్నాడు అంటూ గగ్గోలు పెట్టడమూ అధికార పార్టీకి అలవాటు అయిపోయింది. తాజాగా ఏపీలో భయంకరమైన వైరస్ ఎన్ 440 కె వ్యాపించిందని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా ఊదరగొట్టారు. అయితే అలాంటిది ఏమీ లేదని అధికారులు కూడా ఖండించారు. దీంతో జనాలను వణికించి చంపాలనుకుంటున్నావా బాబూ అంటూ వైసీపీ నేతలు గట్టిగానే తగులుకున్నారు. ఏపీకి నారా వైరస్ పట్టి పీడిస్తోందని మంత్రి కొడాలి నాని అయితే పెద్ద నోరే చేసుకున్నారు.
చంపేస్తారా ఏంటి ..?
ఇక జగన్ సర్కార్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఒక దశలో గట్టిగానే పట్టుపట్టింది. దాని మీదచంద్రబాబూ చినబాబు ఒక్క లెక్కన యాగీ చేశారు. కరోనా వైరస్ టైం లో పరీక్షలు పెట్టి జనాలను చంపేస్తారా అని గుడ్లుమిరారు. ఇక కరోనా మహమ్మారితో జనాలు చస్తూంటే ప్రభుత్వం నిద్రపోతోందని మరో విమర్శ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా. జనాలంటే ఎందుకంత చులకన అంటూ టీడీపీ తమ్ముళ్ళు గట్టిగా తగులుకుంటున్నారు. ఓటేసిన జనాలను కాపాడాలన్న ఆలోచన ఏదీ లేదని కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఏపీకి వైసీపీ వైరస్ పట్టిందని వారు రివర్స్ అటాక్ చేస్తున్నారు.
అలా వదిలేస్తే బెటరేమో..?
రాజకీయాలు చేయడమే నాయకుల లక్షణం. మధ్యలో ప్రజలను ఎందుకు లాగుతారు అన్నదే ఇపుడు జరుగుతున్న చర్చ. ఎవరి శక్తి మేరకు వారు ప్రజలకు సేవ చేయలనే చూస్తారు. కానీ ఏపీలో విచిత్రమైన రాజకీయ పోటీ పెరిగిపోయింది. దాంతో జనాలను అడ్డం పెట్టుకుని పొలిటికల్ డ్రామాకు తెర తీయడమే బాధాకరమని మేధావులు అంటున్నారు. దీని వల్ల ఏపీ పరువు మర్యాదలు కూడా మంట కలుస్తున్నాయని వాపోతున్నారు. ఎటూ జగన్, చంద్రబాబు సహకరించుకునే పరిస్థితి లేదు, ఇపుడు జనాలను వారి మానాన వదిలేసే విషయంలో అయినా కాస్తా కోపరేషన్ చేస్తే అదే మేలు అంటున్నారు సగటు ప్రజానీకం.