నియోజకవర్గాల వారీగా బాబు సమీక్షలు..చివరకు తేలిందేంటంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఆయన తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఇంట్లో ఉంటూనే ఆయన తన పార్టీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఆయన తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఇంట్లో ఉంటూనే ఆయన తన పార్టీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఆయన తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఇంట్లో ఉంటూనే ఆయన తన పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా కూడా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు. ఈ సమీక్షల్లో నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితిపై ఆరా తీశారు. గత ఏడాది ఎన్నికల్లో 23 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే, ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? నాయకుల పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలను ఆరా తీసినట్టు తెలిసింది.
అధికార పార్టీ నేతలతో…..
మొత్తం విషయానికి వస్తే.. అనూహ్యమైన విషయాలు చంద్రబాబుకు తెలిశాయని సమాచారం. ప్రస్తుతం గెలిచిన నియోజకవర్గాల్లో పరిస్థితి.. ఏంటని చంద్రబాబు ఆరాతీయగా.. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి స్తబ్దుగా ఉందనే విషయం వెల్లడైంది. మెజారిటీ నియోజకవర్గాల్లో నాయకులు.. ద్వితీయ శ్రేణి కేడర్ అధికార పార్టీ నేతలతో కలిసి ఎంచక్కా సర్దుకు పోతున్నారని సమాచారం. అధికార పార్టీ నేతలతో టీడీపీ నేతలు లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుని, పనులు చేయించుకునేందుకు రెడీ అయ్యారని చంద్రబాబుకు సమాచారం అందింది.
వైసీపీకి అనుబంధంగా….
ఇక, అదేసమయంలో పార్టీలో ఉంటూనే వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారనే విషయం కూడా చంద్రబాబుకు చేరిందని తెలిసింది. మరి కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి కేడర్ తాము గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన బిల్లుల కోసం టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు చెప్పి కూడా ఫ్యాన్ గూటికిందకు చేరిపోతున్నారట. ఈ విషయం తెలిసినా కూడా ఎమ్మెల్యేలు ఏం చేసే పరిస్థితి లేదని బాబుకు నివేదికలు వెళ్లాయి. మరి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు ఎత్తేసి… ఇప్పుడు పోటీ చేసి మనం ఎక్కడ గెలుస్తాం.. ? అయినా మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని కేడర్‌ను ప్రశ్నిస్తున్నారట.
యరపతినేని నియోజకవర్గంలో….
ఎక్కడో ఎందుకు చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా ఐదేళ్ల పాటు అధికారం అనుభవించి… మంత్రి పదవి లేకపోయినా మంత్రిగా చెలామణి అయిన గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో టీడీపీ స్థానిక ఎన్నికల్లో పూర్తిగా అస్త్ర సన్యానం చేసింది ? అదేమంటే ఇప్పుడు పోటీ చేసినా ఎక్కడ గెలుస్తాంలే ? అన్న ప్రశ్నలు ఆయన వర్గీయుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఈ నిజాలు తెలిసిన తర్వాత విస్తుపోవడం చంద్రబాబు వంతు అయ్యిందట. ఇక, ఓడిపోయిన నియోజకవర్గాల్లో చాలా చోట్ల తమ్ముళ్లు జెండా పక్కన పెట్టేశారు. పార్టీ వాయిస్ వినిపిం చేందుకు, పార్టీ తరఫున మాట్లాడేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
కొందరు మాత్రమే….
అదే సమయంలో కేవలం ఇక, దారి తెన్ను కనిపించని కొందరు నాయకులు మాత్రమే పార్టీలో ఉన్నారని, వారు కూడా అన్యమనస్కంగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని అంటున్నారు. మొత్తంగా పరిస్థితి దారుణంగా ఉందనే విషయం చంద్రబాబుకు తెలియడంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై ఆయ న తర్జన భర్జన పడుతున్నారని సమాచారం. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.