వైసీపీకి చంద్రబాబు ఆ ఆనందం లేకుండా చేశారుగా?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కరోనా కలిసి వచ్చిందా? ప్రపంచం సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కరోనా కుదిపేస్తున్న సమయంలో.. ఒక్క టీడీపీకి మాత్రం కరోనా కలిసి [more]
;
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కరోనా కలిసి వచ్చిందా? ప్రపంచం సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కరోనా కుదిపేస్తున్న సమయంలో.. ఒక్క టీడీపీకి మాత్రం కరోనా కలిసి [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కరోనా కలిసి వచ్చిందా? ప్రపంచం సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కరోనా కుదిపేస్తున్న సమయంలో.. ఒక్క టీడీపీకి మాత్రం కరోనా కలిసి వచ్చిందనే వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా సహా… దాదాపు అన్ని సోషల్ మాధ్యమాల్లోనూ ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కరోనా కనుక లేకపోయి ఉంటే.. టీడీపీ పరిస్థితి వేరేగా ఉండేదని.. కానీ, కరోనా రావడంతో పరిస్థితి మారిందని చెబుతున్నారు. దీనికి రీజనేంటి? అంటే.. రెండు నెలల కిందట మార్చిలో స్థానిక ఎన్నికలు జరిగాయి.
ఘోర పరాజయంతో…?
ఆ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. స్వయంగా చంద్రబాబే.. రంగంలోకి దిగి, విజయవాడ, విశాఖ కార్పొరేషన్లలో ప్రచారం చేసినా.. ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకోలేక పోయింది. అంతేకాదు.. కనీసం గౌరవ ప్రదమైన ఓట్లు కూడా దక్కించుకోలేదు. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుందని టీడీపీలో ఈ విషయంపై అంతర్మథనం జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. అనూ హ్యంగా ఇంతలోనే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో వెంటనే చంద్ర బాబు స్థానిక ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని పక్క పెట్టి రంగంలోకి దిగారు.
తిరుపతి ఉప ఎన్నిక…?
ఫలితంగా స్థానికంగా టీడీపీకి ఎదురైన వ్యతిరేకత.. ఇతరత్రా పరిస్థితులపై చర్చ దారితప్పింది. ఇక, తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కూడా జోరుగా ప్రచారం చేశారు. వారాల తరబడి ప్రచారం చేశారు. అయినా కూడా ఇక్కడ విజయం దక్కించుకోలేకపోయారు. తిరుపతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. చంద్రబాబే స్వయంగా ప్రచారం చేసినా.. ఓడిపోవడంతో చంద్రబాబు నాయకత్వం పైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. ఇవి రాజుకుని.. జోరందుకుని పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని.. ఇవి తమకు లాభిస్తాయని.. వైసీపీ నేతలు అంచనా వేసుకున్నారు.
వ్యూహాత్మకంగా…?
అయితే.. ఇంతలోనే.. రాష్ట్రంలో కరోనా ముసురుకోవడంతో తిరుపతి ఫలితం సహా చంద్రబాబు నాయకత్వపై వచ్చిన దుమారం కూడా దారితప్పేసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపై చర్చను పక్కన పెట్టి.. కేవలం కరోనాపైనే దృష్టి పెట్టారు. దీంతో తిరుపతి సహా స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఎఫెక్ట్ తుడిచిపెట్టుకుపోయి.. కేవలం ఇప్పుడు కరోనా మాత్రమే టీడీపీ రాజకీయ వస్తువుగా చర్చనీయాంశం కావడం గమనార్హం. ఇక, వైసీపీ నేతలు కూడా తిరుపతి విషయాన్ని పక్కన పెట్టడం గమనార్హం.