బాబు పైచేయి సాధించినట్లేనా?
చంద్రబాబు విపక్షంలోకి చేరి రెండేళ్ళు అవుతోంది. ఆయన పార్టీకి జనాలు ఇచ్చింది 23 మంది ఎమ్మెల్యేలు అయితే ఎందరు ఇపుడు పార్టీలో యాక్టివ్ గా ఉన్నారో కూడా [more]
;
చంద్రబాబు విపక్షంలోకి చేరి రెండేళ్ళు అవుతోంది. ఆయన పార్టీకి జనాలు ఇచ్చింది 23 మంది ఎమ్మెల్యేలు అయితే ఎందరు ఇపుడు పార్టీలో యాక్టివ్ గా ఉన్నారో కూడా [more]
చంద్రబాబు విపక్షంలోకి చేరి రెండేళ్ళు అవుతోంది. ఆయన పార్టీకి జనాలు ఇచ్చింది 23 మంది ఎమ్మెల్యేలు అయితే ఎందరు ఇపుడు పార్టీలో యాక్టివ్ గా ఉన్నారో కూడా తెలియదు. అయినా సరే చంద్రబాబు టాక్ ఆఫ్ ది స్టేట్ అవుతున్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మీద ఎప్పటికపుడు పై చేయి సాధించేందుకు కూడా చంద్రబాబు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో వ్యాక్సిన్ కొరత బాగా ఉంది. ఆయా రాష్ట్రాలకు ఫార్మా కంపెనీలకు మధ్య లింక్ పెట్టేసింది కేంద్రం. దాంతో ఇపుడు చాలా రాష్ట్రాలు కిందా మీదా అవుతున్నాయి. ఇక ఏపీలో తీరు చూస్తే వ్యాక్సిన్ల మీద పెద్ద రాజకీయ సమరమే సాగుతోంది.
బాబు కనుక ఉంటే …?
ఇలా దీర్ఘాలు తీస్తున్నారు తమ్ముళ్లు. మా నాయకుడు ఈ టైమ్ లో సీఎం గా ఉంటే కచ్చితంగా ఈపాటికి ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్లు వేయించేసేవారు అంటున్నారు. మరి అది సాధ్యమా. దేశంలో అంతటా వ్యాక్సిన్ల కొరత ఉంటే ఏపీలో ఎలా సాధ్యమవుతుంది అంటే అక్కడే ఉంది కధ అంటున్నారు. హైదరాబాద్ భారత్ బయోటిక్ కంపెనీ తో చంద్రబాబుకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయట. బాబు లాంటి గండరగండడు సీఎం గా ఈ టైమ్ లో ఉంటే ఆయన్ని కాదని మోడీ దగ్గరకు కూడా భారత్ బయోటిక్ వ్యాక్సిన్లు వెళ్ళేవి కాదు అని అంటున్నారు.
అదే రాజకీయమా….?
ఏపీలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల అవసరం ఉంది. ఏడు కోట్ల డోసులు కావాలంటే 73 లక్షలు మాత్రమే ఇప్పటికి ఇచ్చారని జగన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి ఇలాగైతే ఎపుడు వ్యాక్సిన్లు పూర్తిగా దక్కేనూ. అయితే టీడీపీ నేతల మాటలను ఇన్నాళ్లకు వైసీపీ నేతలు కూడా ఒప్పుకున్నట్లే ఉన్నారు. చంద్రబాబుకు అంతగా పలుకుబడి ఉంటే ఆయనే వ్యాక్సిన్లు ఇప్పించేలా చూడండి అంటున్నారు ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని. భారత్ బయోటిక్ పెద్దలతో బంధుత్వాన్ని కూడా చంద్రబాబు వాడి అయినా ఏపీకి వ్యాక్సిన్లు ఇప్పించాలని కూడా కోరుతున్నారు. ఇది పైకి అంటున్నా బాబు వల్లనే తెలుగు రాష్ట్రాలలో తయారవుతున్న వ్యాక్సిన్ ఏపీకి పెద్దగా రావడంలేదని, ఇదే రాజకీయమని కూడా వైసీపీ నేతలు పరోక్షంగా అనేస్తున్నారుట.
దటీజ్ బాబు….
భారత్ బయోటిక్ పెద్దలతో చంద్రబాబుకు ఎంతటి సన్నిహిత పరిచయాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు కానీ వ్యాక్సిన విషయంలో మాత్రం బాబు తలచుకుంటే పని అవుతుంది అని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు అంటే నిజంగా చంద్రబాబు గ్రేట్ అనాల్సిందే. బాబుకు ఏ పదవీ లేదు, ఆయన వరసగా ఎన్నికల్లో ఓడుతున్న ఒక పార్టీ అధినేత. అయినా సరే చంద్రబాబుకు 1600 కోట్లు ఇస్తామని వ్యాక్సిన్లు తెచ్చిపెట్టమని ఒక మంత్రి గారు అంటే మీ పలుకుబడి ఉపయోగించి వ్యాక్సిన్లు ఇప్పించండి అని మరో మంత్రి అంటున్నారు. సరే ఎక్కడ వ్యాక్సిన్లు తయారైనా కూడా వాటిని దేశాన అంతటా సరఫరా చేయాలి. మరి చంద్రబాబు ఉంటే ఆయన పలుకుబడితో ఏపీకి ఈ పాటికి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు వచ్చేవేమో అన్న చర్చ అయితే సగటు జనంలో ఉంది. దానికి బలపరుస్తున్నట్లుగా వైసీపీ నేతల మాటలు కూడా ఉంటున్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఎవరు రాజకీయం చేసినా కూడా అంతిమంగా ప్రజల మేలు కోసమే. మరి వ్యాక్సిన్ ఇపుడు ప్రాణాధారం. నిజంగా చంద్రబాబుకు ఆ పలుకుబడి ఉంటే ఏపీకి ఎక్కువగా అవి దక్కేలా చూసి జనంలో భారీ మైలెజ్ ని రాజమార్గాన పొందవచ్చు అన్నదే మేధావుల సూచన.