నితీష్ బాటలోనే చంద్రబాబు…. ?

ఒక్క చాన్స్ అంటూ ఒక సినిమాలో హీరోయిన్ సంగీత సినీ పెద్దల చుట్టూ తిరుగుతుంది. ఇక ఏపీ రాజకీయాల వరకూ చూస్తే ఒక్క చాన్స్ అంటూ చాలా [more]

;

Update: 2021-05-31 02:00 GMT

ఒక్క చాన్స్ అంటూ ఒక సినిమాలో హీరోయిన్ సంగీత సినీ పెద్దల చుట్టూ తిరుగుతుంది. ఇక ఏపీ రాజకీయాల వరకూ చూస్తే ఒక్క చాన్స్ అంటూ చాలా మంది నాయకులే జనాలను అడిగారు. కానీ వారు కొందరినే ఆదరించారు. నాడు ఎన్టీయార్ టీడీపీతో ఒక్క చాన్స్ అని వస్తే ఒకటి కాదు అనేక అవకాశాలు తెలుగు జనాలు ఇచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ సారధిగా వైఎస్సార్ వస్తే ఆయనకూ రెండు చాన్సులు ఇచ్చారు. జగన్ ఒక్క చాన్స్ అంటే ఏకంగా 151 సీట్లతో బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మరి లాస్ట్ చాన్స్ రాజకీయ కధల సంగతేంటి అంటే వీటికి కూడా మంచి సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది.

ఆయన హిట్ …?

గత ఏడాది బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ తనకు ఇదే లస్ట్ చాన్స్ అంటూ జనాలకు అప్పీల్ చేసుకున్నారు. తాను మళ్లీ పోటీ చేయను, ముఖ్యమంత్రిగా కూడా ఇకపైన కనిపించను అంటూ చెప్పుకున్నారు. మొత్తానికి ఆయనతో పాటు బీజేపీ కూటమిని జనాలు గెలిపించారు. నితీష్ లాస్ట్ చాన్స్ ని అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏపీలో చూసుకుంటే అలాంటి లాస్ట్ చాన్స్ కోసమే చంద్రబాబు ఆశగా ఎదురుచూస్తున్నారుట.

ఇదే స్లోగన్ ….

అదిరిపోయే స్లోగన్ ఉండాలి కానీ అది గన్ లా పేలుతుంది అంటారు. చంద్రబాబు అలాంటి స్లోగన్ ని మూడేళ్ళకు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనంలోకి వెళ్ళి గట్టిగానే నినదిస్తారుట‌. అది సక్సెస్ అయితే పీఠం టీడీపీదే అన్నదే తమ్ముళ్ల ధీమా. 2024 నాటికి చంద్రబాబుకు 74 ఏళ్ళు నిండిపోతాయి. అంటే భారత దేశాన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత అన్న మాట. అందువల్ల తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు జనాల ముందుకు వెళ్తారని అంటున్నారు. 2029 ఎన్నికల్లో తాను అసలు పోటీ చేయను అని ఒట్టేసి మరీ చెబుతారుట. ఏపీని అభివృద్ధి చేయడమే కాదు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన జీవితాశయమని, లాస్ట్ చాన్స్ ఇస్తే అలా ప్రజా సేవ చేసుకుంటాను అని బాబు అప్పీల్ చేయబోతారు అన్నది పసుపు పార్టీలో జరుగుతున్న ప్రచారం.

అదీ మ్యాటర్ …?

ఈ లాస్ట్ చాన్స్ అన్నది చంద్రబాబు కోసం కానే కాదు. లోకేష్ కోసం అన్నది అందరికీ తెలిసిందే. 2024లో ఏపీ జనాలను బతిమాలుకునో బామాలుకునో అధికారం సంపాదించుకుంటే కొన్నాళ్ళ పాటు తాను సీఎంగా పాలించి ఆ మీదట లోకేష్ కి పట్టాభిషేకం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనట. తన కళ్ళముందే కుమారుడు కూడా ముఖ్యమంత్రి అనిపించుకుంటే అదే చంద్రబాబుకు టోటల్ రాజకీయ జీవితంలో అతి పెద్ద అచీవ్ మెంట్ అంటున్నారు. దాని కోసం లాస్ట్ చాన్స్ అంటూ జనాల సింపతీని కొల్లగొట్టాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారుట. మరి ఒక్క చాన్స్ అంటే జగన్ కి 2019 ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన ఏపీ జనం లాస్ట్ చాన్స్, మీ చంద్రబాబు మళ్లీ ఎపుడూ ఇలా వచ్చి ఓట్లు అడగడు అంటూ 2024లో సెంటిమెంట్ డైలాగులు కురిపిస్తే జనాలు పడతారా. ఓట్ల వర్షం కురిపిస్తారా. ఏమో చెప్పలేం. సెంటిమెంట్ కి వర్కౌట్ కాని ఇష్యూస్ లేవు. అందునా రాజకీయాల్లో అదొక పెద్ద ఆయుధం. సో. చంద్రబాబు బ్రహ్మాండమైన ప్లాన్ తో రంగంలోకి దిగబోతున్నారు. జగన్ దీనికి విరుగుడు గా ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News