తప్పుల మీద తప్పులు చేస్తూ… ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో అంతా ఒక మాట చెబుతారు. ఆయనకు వేయి కళ్ళు అంటారు. తన సొంత పార్టీతో పాటు ప్రత్యర్ధి పార్టీలలో జరుగుతున్న [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో అంతా ఒక మాట చెబుతారు. ఆయనకు వేయి కళ్ళు అంటారు. తన సొంత పార్టీతో పాటు ప్రత్యర్ధి పార్టీలలో జరుగుతున్న [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో అంతా ఒక మాట చెబుతారు. ఆయనకు వేయి కళ్ళు అంటారు. తన సొంత పార్టీతో పాటు ప్రత్యర్ధి పార్టీలలో జరుగుతున్న తతంగాన్ని కూడా గమనిస్తూ వాటిని అడ్వాంటేజ్ గా మార్చుకుంటూ బాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీగా ఎదిగారు అంటారు. సరే అది ఒకపుడు వర్కౌట్ అయిందేమో కానీ ఇపుడు సొంత పార్టీలోనే సీన్ కాలుతూంటే ఎదుటి పార్టీ వైపు చూపేలా బాబూ అంటున్నారు అంతా. చంద్రబాబుకు గత రెండేళ్ళుగా పొలిటికల్ గా ఒక్క హిట్ లేదు. దానికి కారణాలు కూడా ఆయనకు తెలుసు. అయిన సరే ఎంతసేపూ వైసీపీ వైపే చూపు సారించడమే విడ్డూరం.
కెలుకుడు ఎందుకో…?
వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉంది. దానికి జగన్ అధినాయకుడు. జగన్ లేని వైసీపీని కూడా ఎవరూ అసలు ఊహించలేరు. అలాగే జగన్ మీద తిరుగుబాటు ఎవరైనా చేస్తారు అనుకుంటే కూడా అది పేరాశ మాత్రమే. కానీ రాజకీయాల్లో ఏమైనా జరిగిపోతాయని తెగ నమ్మే చంద్రబాబు వచ్చిన ప్రతీ అవకాశాలను వాడుకుంటారు అంటారు. లేకపోతే అవకాశాలు కూడా సృష్టించుకుంటారు అని చెబుతారు. వైసీపీలో జగన్ కి ఎంపీ రఘురామ కృష్ణం రాజు కి మధ్య చెడితే మధ్యలో టీడీపీకి ఏం పని అన్న వారూ ఉన్నారు. సరే రాజు జగన్ ని అంతలా రెచ్చి విమర్శించడం వెనక చంద్రబాబు టీడీపీ, దాని అనుకూల మీడియా ఉన్నాయన్న అనుమానాలు ఇంతకాలం అంతా వ్యక్తం చేశారు. ఇపుడు టీడీపీ పెద్దలతో పాటు అనుకూల మీడియా రాజు అరెస్ట్ గురించి గుండెలు బాదుకుంటూంటే నిజమేనని వారికి వారే చెప్పేసుకున్నట్లు అయింది అంటున్నారు.
నాడు అలా చేసే…?
అప్పట్లో కాంగ్రెస్ లో జగన్ కి హై కమాండ్ కి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. అది వారి అంతర్గత వ్యవహారం. కానీ మధ్యలో చంద్రబాబు టీడీపీ దూరిపోయి జగన్ కధను జైలు దాకా తెచ్చారని చెబుతారు. ఫలితంగా జగన్ పెద్ద నాయకుడిగా మారి టీడీపీనే ఏపీలో దెబ్బ తీశారు అని గతాన్ని తలచుకున్న వారి చేసే కరెక్ట్ విశ్లేషణ. ఇపుడు కూడా రాజుకి జగన్ కి గొడవ అయితే వెనక టీడీపీ ఉంది అన్న అభిప్రాయాలు బలపడేలా భారీ మద్దతు ఇస్తూ వస్తున్నారు. దీని వల్ల రాజు వివిధ సామాజిక వర్గాలను, కొన్ని మతాలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కి కూడా టీడీపీ బాధ్యత వహించాల్సి వస్తోందని అంటున్నారు.
రెడ్ సిగ్నల్ ….
ఏపీలో రెడ్డి సామాజికవర్గాన్ని రాజు విమర్శించారు అని వీడియో సహితంగా సీఐడీ ఆధారాలు సంపాదించింది. వాటిని చానళ్ళలో కూడా మళ్ళీ ప్రసారం చేస్తున్నాయి. ఇక ఒక మతాన్ని కూడా ఆయన పనిగట్టుకుని టార్గెట్ చేశారు అంటున్నారు. మరి ఆ మతాల వారు కులాల వారు ఇపుడు రాజుకు మద్దతుగా నిలుస్తున్న టీడీపీ మీద కూడా గుస్సాగా ఉన్నారని అంటున్నారు. సమాజంలో అన్ని వర్గాలు ఉంటాయి. అలాగే అన్ని వర్గాల ఓట్లు రాజకీయ పార్టీలకు కావాలి. రెబెల్ ఎంపీకి ఇవేమీ అవసరం లేదు కాబట్టి శృతి మించారు, మరి ఆయన్ని వెనకేసుకు వస్తున్న టీడీపీకి కూడా ఈ వర్గాల మద్దతు అక్కరలేదా అని వారు నిలదీస్తున్నారు. ఇప్పటికే రెడ్ల సంఘం రాజు విషయం మీకెందుకు బాబూ అంటూ సున్నితంగా విమర్శలు చేసింది. ఒక కులాన్ని పనిగట్టుకుని విమర్శిస్తే రాజకీయ పార్టీగా ఎలా వత్తాసు పలుకుతారు అంటున్నారు కూడా. మొత్తానికి సొంత పార్టీని చక్కదిద్దుకోకుండా షార్ కట్ మెదడ్స్ లో రాజకీయం చేద్దామనుకుంటే ఇవి మామ కాలం నాటి మంచి రోజులు కావు చంద్రబాబు అని అంటున్నారుట.