బాబు ఆరాటమంతా అందుకేనా… ?
రాజకీయాల్లో చిత్త శుద్ధి ఉండాలి. లక్ష్యం కూడా కరెక్ట్ గా ఉండాలి అపుడే ఆశించిన విజయాలు సిద్ధిస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు విషయంలో తీసుకుంటే ఆదిలో [more]
;
రాజకీయాల్లో చిత్త శుద్ధి ఉండాలి. లక్ష్యం కూడా కరెక్ట్ గా ఉండాలి అపుడే ఆశించిన విజయాలు సిద్ధిస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు విషయంలో తీసుకుంటే ఆదిలో [more]
రాజకీయాల్లో చిత్త శుద్ధి ఉండాలి. లక్ష్యం కూడా కరెక్ట్ గా ఉండాలి అపుడే ఆశించిన విజయాలు సిద్ధిస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు విషయంలో తీసుకుంటే ఆదిలో ఆయన గురి అర్జునుడి చేతిలో బాణం మాదిరిగా ఉండేది. పక్షి కన్ను మీదనే టార్గెట్ ఉండేది. కానీ గడచిన కొంతకాలంగా బాబు ఆలోచనలు అన్నీ కూడా కుమారుడు లోకేష్ చుట్టూనే తిరుగుతున్నాయి. లోకేష్ ని సీఎం చేయాలన్నదే ఆయన ఆరాటమని కూడా తెలిసిపోతోంది.
అక్కడే చిక్కు :…
భారత రాజకీయాల్లో వారసత్వం అన్నది సహజమైన పరిణామమే. అయితే ఇంతవరకూ ఏ నాయకుడూ కూడా తన వారసుడిని గద్దెనెక్కించడానికి అధికారం కావాలని కోరిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాత్రం ఈసారి ఎలాగైనా పవర్ సంపాదించి లోకేష్ ని సీఎం చేయాలని గట్టి పట్టుదల మీద ఉన్నారని చెబుతారు. అయితే అది మనసులో ఉంచుకుంటే తప్పు లేదు కానీ చంద్రబాబు తాపత్రయం తపన అంతా బయటకు తెలిసిపోవడంతోనే క్యాడర్ డల్ అయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబే మా నాయకుడు అని ఇప్పటికీ బలంగా క్యాడర్ నమ్మడమే దీనికి ప్రధాన కారణం.
ఫుల్ సైలెంట్ ….
విశాఖ జిల్లా లో బలమైన నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు కూడా సైలెంట్ కావడానికి లోకేష్ నాయకత్వాన్ని పార్టీ మీద రుద్దడమే అని ప్రచారం అయితే సాగుతోంది. రాష్ట్రంలో చాలా మంది నాయకులకు చంద్రబాబు తో ఎలాంటి తేడా పాడాలు లేవు. లోకేష్ విషయంలోనే వారు డిఫర్ అవుతున్నారు. చివరికి బాబు సొంత సామాజికవర్గంలో కూడా లోకేష్ వద్దు అన్న మాట వినిపిస్తోంది అంటే దానికి చంద్రబాబు గ్రహించాల్సి ఉందని అంటున్నారు. అయినా సరే చంద్రబాబు అంతా లోకేష్ చుట్టూనే తిప్పుటూ రాజకీయాలు చేయడమే పార్టీ నాయకులకు విస్మయంగా తోస్తోందిట.
ప్రయోగాలు అవసరమా :
టీడీపీ చూస్తే అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఏపీలో ఎదుర్కొంటోంది. జగన్ నుంచి పెను సవాలే ఎదురవుతోంది. ఒక సర్కార్ కి రెండేళ్లు దాటినా వ్యతిరేకత రాకపోవడం అంటే మరోసారి విజయానికి అది సంకేతమని కూడా రాజకీయ మేధావుల భావనగా ఉంది. దానికి మరింతగా బలం చేకూర్చేలా విపక్ష తెలుగుదేశం పార్టీ చర్యలు ఉంటున్నాయని అంటున్నారు. చంద్రబాబు టీడీపీని ఎలా గట్టెక్కించాలి అన్న దాని మీద కంటే లోకేష్ ని ఎలా నాయకుడిగా నిరూపించాలి అన్న విషయం మీదనే అధిక శ్రద్ధను చూపిస్తున్నారు అంటున్నారు. ఈ రకమైన ఆరాటం వల్లనే టీడీపీ అచేతనంగా రాజకీయాల్లో నిలిచి పోతోందని చెబుతున్నారు.
సీనియర్లను చేరదీస్తేనే …?
చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ పార్టీని పవర్ లోకి తేవడమే కావాలని కూడా హితైషులు సూచిస్తున్నారు. అలా ఆయన యాక్షన్ కనిపించాలి అంటే ముందు లోకేష్ కి కాస్తా దూరం పెట్టి సీనియర్లకు పార్టీలో పెద్ద పీట వేసి ముందుకు నడవాలని సూచిస్తున్నారు. మరి బాబు ఆ పని చేయగలరా. ప్రతీ దానికీ లోకేష్ నే ముందు పెట్టి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు వంటి వారిని తగ్గించడం ఏ రకమైన సంకేతాలను పంపుతుందని కూడా ప్రశ్న వస్తోంది. మొత్తానికి అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడు అని వెనకటికి ఒక సామెత మాదిరిగా చంద్రబాబు పోరాటం ఆరాటమంతా వారసుడి కోసమే అయితే మాత్రం మరిన్ని ఇబ్బందులు తప్పనవి అంటున్నారు.