ఇన్నింగ్స్ అయిపోతున్నాయి బాబూ… ?

తెలుగుదేశం పార్టీని పాతికేళ్లకు పైగా చంద్రబాబు మోస్తున్నారు. ఇది నిజంగా గ్రేట్ అనాల్సిందే. బాబుకు పొలిటికల్ గా గ్లామర్ లేదు. మాటకారి కూడా కానే కాదు అయినా [more]

;

Update: 2021-05-30 06:30 GMT

తెలుగుదేశం పార్టీని పాతికేళ్లకు పైగా చంద్రబాబు మోస్తున్నారు. ఇది నిజంగా గ్రేట్ అనాల్సిందే. బాబుకు పొలిటికల్ గా గ్లామర్ లేదు. మాటకారి కూడా కానే కాదు అయినా అత్యధిక కాలం సీఎం గా చేశారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అనిపించుకున్నారు. కానీ ఏ ఆటకు అయినా ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడడం ఖాయం. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ అధినేతకు కూడా రెండేళ్ళుగా అసలు గేమ్ కలసిరావడంలేదు. మరో వైపు వికెట్ పడగొట్టాలన్న ఆరాటం ఎంతగా ఉన్నా కూడా గురి తప్పుతోంది.

అది జరిగే పనేనా?

ఏపీలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని వైసీపీ మీద పోరాటం చేస్తామని తెలుగుదేశం మహానాడులో తీర్మానం చేసింది. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో అది జరిగే పనేనా అన్నదే చర్చ. చంద్రబాబుకి ఈ రోజుకు నిజమైన మిత్రులు ఎవరూ లేరు. ఆయన కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు అనే అనుకుంటారు. అందువల్లనే ఇపుడు ఈ రకమైన స్థితి ఏర్పడింది. ఇక ఏపీలో సీపీఐ ఇప్పటిదాకా టీడీపీ వెంట నడిచింది కానీ ఇదే సీపీఐ చంద్రబాబు మీద గుస్సా అవుతోంది. దానికి మహానాడులో చేసిన మరో తీర్మానం కారణం. దశల వారీగా కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తామని తెలుగుదేశం పేర్కొనడంతో సీపీఐ రామక్రిష్ణ మండిపడుతున్నారు.

మీకో దండం ….

ఇక బీజేపీకి మహనాడు వేదిక ద్వారా సానుకూల సంకేతాలు పంపించినా కూడా టీడీపీ ముఖం చూసేది లేదని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ డియోధర్ పక్కా క్లారిటీగా చెప్పేసారు. చంద్రబాబు ఎన్టీయార్ నే కాదు, మోడీకి కూడా వెన్నుపోటు పొడిచారు అని కూడా ఆయన అంటున్నారు. అటువంటి బాబు పార్టీతో మాకేం పని అని కూడా చెప్పేస్తున్నారు. తమకు ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని, ఈ రెండు పార్టీలే అటు వైసీపీని, ఇటు టీడీపీని కూడా ఎదుర్కొంటాయని సునీల్ అంటున్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తుల కలలు మానుకోవాలని కూడా చెప్పేశారు.

ఒంటరిగానే …?

ఏపీ రాజకీయాలు చూస్తే వైసీపీ బలమైన పార్టీగా ఉంది. ఇందులో రెండవ మాటకు అసలు తావు లేదు. ఆ పార్టీని ఢీ కొట్టాలి అంటే టీడీపీ బలం అసలు సరిపోదు. మరి బీజేపీ, జనసేన వంటి వాటితో ముందుకు రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ బీజేపీ ససేమిరా అంటోంది. అదే విధంగా బీజేపీ వూసెత్తితే మాతో కట్ అంటోంది సీపీఐ, ఇక బాబుకు ఏపీలో కాంగ్రెస్ మాత్రమే మిగిలింది. కానీ ఆ పార్టీ కూడా బాబు బీజేపీ ఆరాటాలను చూసి దూరమనే చెబుతోంది. మొత్తానికి పాతికేళ్ళ పొత్తుల రాజకీయం చివరికి ఇలా వికటించింది అని తమ్ముళ్ళు చింతించాల్సిందే. అదే సమయంలో ఇన్నింగ్స్ అన్నీ అయిపోయాక హ్యాండ్సప్ అనడం మినహా చంద్రబాబు రాజకీయ మైదానంలో చేసేది లేదన్నదే విశ్లేషణ.

Tags:    

Similar News