యాక్టివ్ అయ్యేదెప్పుడు…? మళ్లీ మొదటికొచ్చారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాపైనే ఎక్కువగా దిగులుపట్టుకుంది. చిత్తూరు జిల్లాలో నేతలు యాక్టివ్ గా లేకపోవడమే ఇందుకు కారణం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల [more]

;

Update: 2021-06-19 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాపైనే ఎక్కువగా దిగులుపట్టుకుంది. చిత్తూరు జిల్లాలో నేతలు యాక్టివ్ గా లేకపోవడమే ఇందుకు కారణం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలోనూ నేతలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం చంద్రబాబు గుర్తించారు. ఆర్థిక పరిస్థితులు, అధికార పార్టీ అక్రమ కేసులకు భయపడి నేతలు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఇప్పటి వరకూ చంద్రబాబు భావించారు.

పార్టీ పరిస్థితి….?

కానీ చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని ఆయనకు అందిన నివేదికల ద్వారా స్పష్టమయినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లా. గత ఎన్నికల్లో చంద్రబాబు మినహా ఇక్కడ ఎవరూ విజయం సాధించలేదు. దీంతో చంద్రబాబు ఈసారి తన సొంత జిల్లాలో పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. వారానికి ఒకసారి జూమ్ యాప్ లో చిత్తూరు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు.

జనసమీకరణ విషయంలో…?

కానీ ఫలితం కన్పించడం లేదు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా స్వయంగా తాను అన్ని నియోజకవర్గాల్లో పర్యటించినా జన సమీకరణ విషయంలోనూ నేతలు ఫెయిలయ్యారని చంద్రబాబు గుర్తించారు. రోడ్ షోలకు కూడా జనాన్ని సమీకరించలేకపోయారు. దీంతో చిత్తూరు జిల్లా నేతలపై చంద్రబాబు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పేరున్న నేతలున్నా బయటకు రాకుండా పార్టీని మరింత బలహీనం చేస్తున్నారని చంద్రబాబు భావిస్తున్నారు.

మాజీ మంత్రులతో సహా….?

మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డితో సహా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గల్లా అరుణకుమారి, బొజ్జల సుధీర్ రెడ్డి వంటి నేతలు పార్టీలో ఉన్నా లేనట్లే కన్పిస్తున్నారు. వీరందరూ యాక్టివ్ అయితేనే చిత్తూరు జిల్లాలో క్యాడర్ లో ఉత్సాహం నెలకొంటుంది. అందుకే చంద్రబాబు కరోనా తగ్గిన వెంటనే చిత్తూరు జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాను ఈసారి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి చిత్తూరు జిల్లా నేతలు చంద్రబాబుకు ఏమేరకు సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News