అందరిదీ ఒకే మాట … బాబుకు ఇబ్బందులు తప్పవా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి అన్ని సమస్యలతో పాటు ప్రధాన సమస్యను ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకోవడం [more]

;

Update: 2021-06-21 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి అన్ని సమస్యలతో పాటు ప్రధాన సమస్యను ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకోవడం చంద్రబాబుకు ఛాలెంజ్ గా చెప్పాలి. అదే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవడం కూడా చంద్రబాబుకు బిగ్ టాస్క్. వీటిని పక్కన పెడితే ప్రధాన సమస్య నిధులు. ఎన్నికల నిధుల సమస్య ను ఈసారి చంద్రబాబు ఎలా అధిగమిస్తారన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనే?

గతంలో అధికారంలో ఉండటం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడంతో పెద్దగా నిధుల సమస్య రాలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లోనే గత ఎన్నికల్లో చంద్రబాబు నిధులను అభ్యర్థులకు అందజేశారు. కేంద్రంతో వైరం కారణంగా పార్టీకి నిధుల రాక కూడా తగ్గిపోయింది. కార్పొరేట్ కంపెనీలు, సంప్రదాయంగా పార్టీకి నిధులు ఇస్తున్న వారు కూడా మొహం చాటేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు నిధుల సమస్య ఇబ్బందిగా మారనుందంటున్నారు.

ఈసారి జనరల్ నియోజకవర్గాల్లోనూ…

ఈసారి రిజర్వ్ డ్ నియోజకవర్గాలే కాదు జనరల్ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా నిధులు ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తాము కోట్లు ఖర్చు పెట్టుకుని ఓటమి పాలయ్యామని, ఈసారి తాము ఎన్నికల ఖర్చును భరించలేమని ఇప్పుడే కొందరు చేతులెత్తుస్తున్నారట. ప్రధనంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్న వారు సయితం ఇదే మాటను చెబుతుండటం చంద్రబాబుకు ఇబ్బందిగా మారిందంటున్నారు.

ఆర్థికంగా నష్టపోయామంటూ….

తమ వ్యాపారాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని అనేకమంది ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారట. తమకు నిధులు అవసరమని నేరుగా చెప్పకపోయినప్పటికీ తాము అధికార పార్టీకి ధీటుగా వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయాలంటే పార్టీ నుంచి సాయం అవసరమని కొందరు ఇప్పటి నుంచే చెబుతుండటం విశేషం. దీంతో 175 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో చంద్రబాబు నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో నిధుల సమస్య ఇబ్బందిగా మారే అవకాశముంది.

Tags:    

Similar News