బాబుకు ఆయన అవసరం ఇక ఏమాత్రం లేదట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల వ్యూహకర్తను కూడా [more]

;

Update: 2021-06-16 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల వ్యూహకర్తను కూడా నియమించుకున్నారన్న వార్తలు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ టీంలో సభ్యుడైన రాబిన్ శర్మను చంద్రబాబు తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారని ప్రచారం జరిగింది. ప్రచారమే కాదు నిజం కూడా. రాబిన్ శర్మ టీం ఏపీలో దిగి తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా సర్వేలు కూడా నిర్వహించింది.

తిరుపతి ఉప ఎన్నికల్లో…?

తిరుపతి ఉప ఎన్నికల్లో రాబిన్ శర్మ టీం ఫెయిలయిందన్న వాదనలు వినపడుతున్నాయి. దీంతో చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మను కొనసాగించడంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రాబిన్ శర్మతో చంద్రబాబు డీల్ ను ఖతం చేయాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ముందుగానే నియమించుకుని….

చంద్రబాబు మించిన ఎన్నికల వ్యూహకర్త మరొకరు ఉండరు. ఆయన అనేక ఎన్నికలను చూశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లి విజయాలు కూడా దక్కాయి. అయితే ఈసారి చంద్రబాబుకు గెలుపు అనివార్యం. 2024 ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలయితే పార్టీ మనుగడ కూడా కష్టమేనని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ముందుగానే రాబిన్ శర్మను ఎన్నిలక వ్యూహకర్తగా నియమించుకున్నారు.

తప్పుడు సలహాలు….?

అయితే గత కొన్నాళ్లుగా రాబిన్ శర్మ టీం ఇచ్చిన సలహాలు ఏమాత్రం క్షేత్రస్థాయిలో పనిచేయలేదని చంద్రబాబు గుర్తించారు. ముఖ్యంగా దేవాలయాలపై దాడులు సందర్భంగా చంద్రబాబు పర్యటన వంటివి రాబిన్ శర్మ టీం ఆలోచనలే. అయితే వాటి వల్ల కొన్ని వర్గాలు టీడీపీకి దూరమయ్యాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా ఎన్నికల వ్యూహకర్త తమకు అవసరం లేదని చంద్రబాబు డిసైడ్ అయ్యారంటున్నారు. రాబిన్ శర్మను కాంట్రాక్టు గడువు ముగియక ముందే పంపించేయాలని నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News