ముందు అక్కడి నుంచి నరుక్కొస్తారట…?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీన పడింది. నేతలు, క్యాడర్ ఇతర పార్టీలను చూసుకున్నారు. ఓటు బ్యాంకు కూడా ఇతర పార్టీలకు మళ్లింది. అయినా చంద్రబాబు మాత్రం [more]
;
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీన పడింది. నేతలు, క్యాడర్ ఇతర పార్టీలను చూసుకున్నారు. ఓటు బ్యాంకు కూడా ఇతర పార్టీలకు మళ్లింది. అయినా చంద్రబాబు మాత్రం [more]
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీన పడింది. నేతలు, క్యాడర్ ఇతర పార్టీలను చూసుకున్నారు. ఓటు బ్యాంకు కూడా ఇతర పార్టీలకు మళ్లింది. అయినా చంద్రబాబు మాత్రం తెలంగాణలో టీడీపీయే తనకు శ్రీరామరక్ష అని భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని కొనసాగించాలన్నదే చంద్రబాబు నిర్ణయం. భవిష్యత్ లో రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.
ఏపీపైనే అంతా?
చంద్రబాబుకు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ముఖ్యం కాదు. ఆయన దృష్టంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. అయితే ఇక్కడ తెలంగాణలో ముందుగా కుదిరిన పొత్తులు ఆంధ్రప్రదేశ్ లో కంటిన్యూ అవుతాయన్నది చంద్రబాబు నమ్మకం. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు క్రమంగా పుంజుకుంటుంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా అది కనపడుతుంది. బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా తెలంగాణపైనే ఎక్కువగా ఆశలున్నాయి.
బీజేపీతో పొత్తుకు…?
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులకు బీజేపీ సహజంగానే ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి చేదు అనుభవాన్ని చవి చూసిన బీజేపీ ఈసారి కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది. జనసేన పార్టీ తన మిత్రపక్షంగా ఇప్పటికే ఉంది. ఇక తెలంగాణలో విజయం సాధించాలంటే ఇతర పార్టీల మద్దతు కూడా అవసరం. అందుకోసమే చంద్రబాబు కాచుక్కూర్చున్నారు. తెలంగాణలో ముందుగా శాసనసభ ఎన్నికలు జరుగుతాయి.
ఇక్కడి నుంచే…?
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుంటే ఆ తర్వాత జరిగే ఏపీ ఎన్నికల్లో కూడా కొనసాగించవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే తెలంగాణ టీడీపీ నుంచి ఏ నేత వెళ్లినా పార్టీని కొనసాగించేందుకే చంద్రబాబు ఇష్టపడుతున్నారు. ఇక్కడ బలమైన నేతలు లేకపోయినా ఓటు బ్యాంకు తమకు ఉందని, ప్రధానంగా సీమాంధ్ర ఓటర్లతో పాటు, ఒక సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయన్నది చంద్రబాబు తన మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే తెలంగాణలో ముందుగా బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.