బాబు తప్పులో కాలేశారా… ?
చంద్రబాబుకు ముందు చూపు ఎక్కువ. ఆయన దార్శనికుడు అని చెబుతారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన రోజుల్లో సైబరాబాద్ ని అభివృద్ధి చేశారు. ఫలితంగా [more]
;
చంద్రబాబుకు ముందు చూపు ఎక్కువ. ఆయన దార్శనికుడు అని చెబుతారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన రోజుల్లో సైబరాబాద్ ని అభివృద్ధి చేశారు. ఫలితంగా [more]
చంద్రబాబుకు ముందు చూపు ఎక్కువ. ఆయన దార్శనికుడు అని చెబుతారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన రోజుల్లో సైబరాబాద్ ని అభివృద్ధి చేశారు. ఫలితంగా ఈ రోజు హైదరాబాద్ మరో లెవెల్ లో ఎదిగింది అంటారు. చంద్రబాబు అప్పట్లోనే విశాఖకు తరచూ వచ్చేవారు. విశాఖను హైదరాబాద్ తో ధీటుగా అభివృద్ధి చేస్తానని చెప్పేవారు. మరి అలాంటి సువర్ణ అవకాశం చంద్రబాబుకు 2014లో దక్కింది. ఆయనే నవ్యాంధ్ర తొలి సీఎం అయ్యారు. రాజధాని ఎంపిక ఆయనే చేయాల్సి వచ్చింది. అలాంటి కీలకమైన వేళ చంద్రబాబు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా అన్నదే ఇప్పటికీ సాగుతున్న చర్చ.
ఆ నినాదం ఏమైంది…?
విశాఖను ఆర్ధిక, సాంస్కృతిక, పర్యాటక రాజధాని అని చంద్రబాబు ఒకటికి పదిమార్లు చెప్పుకొచ్చేవారు. విశాఖ కూడా మరో రాజధానిగా ఎదిగే వీలుందని కూడా ఉమ్మడి ఏపీ సీఎం గా ఆయన అంచనా వేసేవారు. మరి విశాఖను రాజధాని చేయమని విభజన తరువాత అంతా కోరినా చంద్రబాబు చెవులకు ఎందుకు ఎక్కలేదు అన్నదే ఒక ప్రశ్న. విశాఖను రాజధాని చేయాలన్న డిమాండ్ కూడా ఆరు దశాబ్దాల క్రితం నాటిదని చంద్రబాబుకు తెలియదా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. ఏది ఏమైనా విశాఖ వంటి మహా నగరాన్ని తన చేతుల మీదుగా రాజధాని చేసే అవకాశాన్ని బాబు పోగొట్టుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.
అపర సృష్టిగా…?
ఆనాడు విశాఖ, విజయవాడ మాత్రమే ఏపీకి రాజధానులు అయ్యే విషయంలో పోటీ పడ్డాయి. అయితే చంద్రబాబు మాత్రం ఎవరూ ఊహించని విధంగా అపరసృష్టి చేశారు. అమరావతి పేరు మీద ఒక మహనగరాన్నే నిర్మించాలని తాపత్రయపడ్డారు. దాని ఫలితంగానే ఏపీ రాజధాని విషయంలో ఇప్పటికీ ఇబ్బందులు పడుతోందని అంతా అంతారు. రాజధానులు అన్నవి కట్టరు, అవి కాలానుగుణంగా రూపుదిద్దుకుంటాయి. మరి అంతటి మేధావి అయిన చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు తప్పులో కాలేశారు అంటే ఇప్పటికీ ఎవరికీ అర్ధం కాని విషయంగానే ఉంది.
నాడే చేసి ఉంటే…?
ఇక దీని మీద మంత్రి అవంతి శ్రీనివాసరావు అయితే చంద్రబాబునే తప్పుపడుతున్నారు. విశాఖను చంద్రబాబు నాడే రాజధానిగా ప్రకటించి ఉంటే ఈ రోజునకు హైదరాబాద్ తో ధీటుగా ఎదిగి ఉండేదని అంటున్నారు. చంద్రబాబు విశాఖను ఏ మాత్రం అభివృద్ధి చేయాలన్న ధ్యాస లేదని కూడా ఆయన మండిపడుతున్నారు. అయితే జగన్ సీఎం అయ్యాక సరైన నిర్ణయం తీసుకున్నారని అందుకే విశాఖ మళ్ళీ దేశంలో మారుమోగుతోందని అవంతి అంటున్నారు. మొత్తానికి విశాఖ రాజధానిగా రావడం ఖాయమని వైసీపీ మంత్రులు బల్ల గుద్దుతున్నారు. మరో దశాబ్దం తరువాత విశాఖ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది అందరూ ఆశ్చర్యపోయే విధంగా మహా నగరం అవుతుందని కూడా జోస్యం చెబుతున్నారు.