చంద్రబాబు అందుకే అందరికీ దూరమయ్యారా..?
నాయకుడుగా చంద్రబాబుకు నూటికి నూరు మార్కులు పడతాయి. అయితే.. స్వోత్కర్షల విషయంలో కూడా ఆయనకు ఇవే మార్కులు పడుతుండడం గమనార్హం. ఇదే ఆయనను ఇతర పార్టీల నేతలకు [more]
;
నాయకుడుగా చంద్రబాబుకు నూటికి నూరు మార్కులు పడతాయి. అయితే.. స్వోత్కర్షల విషయంలో కూడా ఆయనకు ఇవే మార్కులు పడుతుండడం గమనార్హం. ఇదే ఆయనను ఇతర పార్టీల నేతలకు [more]
నాయకుడుగా చంద్రబాబుకు నూటికి నూరు మార్కులు పడతాయి. అయితే.. స్వోత్కర్షల విషయంలో కూడా ఆయనకు ఇవే మార్కులు పడుతుండడం గమనార్హం. ఇదే ఆయనను ఇతర పార్టీల నేతలకు దూరం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మళ్లీ కూటమి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మోడీని వ్యతిరేకించే వారితో ఆమె జట్టుకట్టి.. కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దెదింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
మమతకు దూరమయి…
ఈ క్రమంలోనే ఏపీ విషయానికి వస్తే.. మమతకు చాలా ఇక్కడ అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. సీఎం జగన్ సహా ప్రతిపక్ష నేత చంద్రబాబును కలుపుకొని ముందుకు సాగాలని ఆమె భావిస్తున్నారు. సీఎం జగన్ విషయాన్ని పక్కన పెడితే.. చంద్రబాబుకు, మమతకు మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. చంద్రబాబు హయాంలో బెంగాల్ సీఎంకు ఆయన ఎంతో మద్దతు ప్రకటించారు. అదేవిధంగా కేంద్రంపై సై అంటే సై అన్న మమత వెంట చంద్రబాబు నడిచారు. కానీ, చంద్రబాబు ఎటు అడుగులు ఎటు మార్చుకుంటారో తెలియని పరిస్థితి నెలకొనడంతో మమతకు ఆయన దూరమయ్యారు.
పవార్ జాబితాలోనూ?
ఇక, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కూడా చంద్రబాబుకు బాగా సన్నిహితులు. ఇప్పుడు ఆయన కూడా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని వ్యతిరేకించే నేతలను కూడగడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. త్వరలోనే జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు. ఈ ఎన్నికలో శరద్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోఅన్ని రాష్ట్రాల నేతలకు ఆయన సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ జాబితాలో చంద్రబాబు పేరు లేదని తెలుస్తోంది. దీనికి కూడా చంద్రబాబు వైఖరే కారణమని.. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియనిఅంటున్నారు పరిశీలకులు. ఇక, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ కూడా చంద్రబాబును నమ్మడం లేదు.
వైఖరే అసలు కారణం…..
నిజానికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు తరఫున ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఇక, ఇప్పుడు ఆయనకూడా ఆర్టికల్ 370 రద్దుపై ఉద్యమించాలని భావిస్తున్నారు. తనతో కలిసి వచ్చేవారికి ఆయన లేఖలు రాస్తున్నారు. ఈ జాబితాలోనూ చంద్రబాబు పేరు లేకపోవడం గమనార్హం. ఇలా.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు.. ఇప్పుడు తన వైఖరి కారణంగానే ఆయా నేతలకు దూరమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.