చివరకు అమరావతి శాపంగా మారుతుందా?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అనేక రకాల ఇబ్బందులు కలగనున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములను అవే డిసైడ్ చేయనుండటంతో చంద్రబాబులో కలవరం నెలకొంది. ఇందులో ప్రధానంగా [more]

;

Update: 2021-07-04 12:30 GMT

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అనేక రకాల ఇబ్బందులు కలగనున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములను అవే డిసైడ్ చేయనుండటంతో చంద్రబాబులో కలవరం నెలకొంది. ఇందులో ప్రధానంగా అమరావతి అంశం ఆయనకు అడ్డంకిగా మారనుందన్నది వాస్తవం. అమరావతి రాజధాని మరోసారి చంద్రబాబును అధికారంలోకి రాకుండా చేస్తుందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

అధికారంలోకి రాగానే…

2014లో అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం మధ్యలో ఉంది కాబట్టి దీనికి పెద్దగా ఎవరూ అభ్యంతరం తెలపలేదు. అదే సమయంలో అన్ని అమరావతి ప్రాంతానికే కేటాయించడంతో ఇతర ప్రాంతాల్లో అసంతృప్తి ఉంది. కనీసం హైకోర్టును కర్నూలుకు తరలిస్తే సరిపోయేది. కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని ఉద్యమాలు జరిగినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఇక అమరావతిపై హడావిడిచేశారు. గ్రాఫిక్స్ ను చూపెట్టారు. కానీ తన టర్మ్ పూర్తయ్యేసరికి తాత్కాలిక భవనాలే అక్కడ మిగిలాయి.

అన్నీ అమరావతికే….

దాదాపు అన్ని సంస్థలు అమరావతికే కేటాయించారు. ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలకు కొంత ఇబ్బందిగా మారింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రతిపాదించారు. దీనికి అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అయినా చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అమరావతి రాజధానిని పట్టుకునే వేలాడుతున్నారు. ప్రపంచలోనే అత్యుత్తమ రాజధానిని చేస్తానంటూ ఇప్పటికీ చెబుతున్నారు.

వాటిని అడ్డుకుంటూ…

ఇది వచ్చే ఎన్నికలకు చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారనుందని చెబుతున్నారు. అమరావతి రాజధాని కోసం కనీసం గుంటూరు, విజయవాడ ప్రజలు కూడా టీడీపీకి అండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరిగినా చంద్రబాబు మాత్రం రాజధాని అమరావతిపై తన స్టాండ్ ను మార్చుకోలేదు. పైగా న్యాయరాజధాని, పరిపాలన రాజధానిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తుంది. న్యాయస్థానాల ద్వారా మూడు రాజధానులను టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభావవం 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News