బాబు వ్యూహ‌మేంటి… దొరికిపోతారా… దూర‌మ‌వుతారా ?

రాజ‌కీయ ప‌రిణామాలు, ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. నిన్నటి నేతలు.. నేడు డ‌మ్మీలుకావొచ్చు. పార్టీలు ఏవైనా.. ప‌రిణామాలు అనూహ్యంగా మారిపోనూ వ‌చ్చు. ఇప్పుడు ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ [more]

;

Update: 2021-06-26 00:30 GMT

రాజ‌కీయ ప‌రిణామాలు, ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. నిన్నటి నేతలు.. నేడు డ‌మ్మీలుకావొచ్చు. పార్టీలు ఏవైనా.. ప‌రిణామాలు అనూహ్యంగా మారిపోనూ వ‌చ్చు. ఇప్పుడు ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అధినేత చంద్రబాబు వైఖ‌రిపైనా ఇలాంటి సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఫ్యూచ‌ర్ గురించి చెప్పుకొనే ముందు.. గ‌తంలో చంద్రబాబు ఏం చేశారో.. చూద్దాం. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌ట్టుక‌ట్టి.. ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అధికారంలోకి రాగానే.. టీడీపీ స‌ర్కారులో బీజేపీకి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అదేవిధంగా.. కేంద్ర స‌ర్కారులోనూ చేరి మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు.

మూడేళ్ల తర్వాత…?

క‌ట్ చేస్తే.. మూడేళ్ల త‌ర్వాత‌.. ఈ బంధం విడిపోయింది. రుస‌రుస‌లు.. మాట విసుర్లు.. నువ్వొక‌టంటే.. నే రెండంటా! అనే తీరులో యుద్ధం సాగింది ఇరు పార్టీల మ‌ధ్య. ఇక‌, తాను ప్రవేశ పెట్టిన సంక్షేమ ప‌సుపు కుంకాల‌తో అధికారంలోకి వ‌చ్చేస్తానంటూ.. ఒంట‌రి పోరాటం చేసిన చంద్రబాబుకు .. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. బీజేపీ స‌హా కాంగ్రెస్ మిన‌హా క‌లిసి వ‌చ్చే అన్ని పార్టీల‌తోనూ పొత్తు పెట్టుకునిముందుకు సాగాల‌ని నిర్ణయించుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో…..

అయితే.. బీజేపీ పెద్దలు మాత్రం చంద్రబాబును ప‌క్కన పెడ‌తామ‌ని అంటున్నారు. కానీ, వ‌చ్చే ఏడాది ఈ ఇద్దరికీ అగ్ని ప‌రీక్షగా మార‌నుంది. వ‌చ్చే ఏడాది జూలైలో రాష్ట్రప‌తి ఎన్నిక‌లు ఉన్నాయి. గ‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు చంద్రబాబు మ‌ద్దతు ప‌లికారు. ఇక‌, వ‌చ్చే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో నూ బీజేపీకి చంద్రబాబు అవ‌స‌రం.. బాబుకు ఏపీ ఎన్నిక‌ల్లో బీజేపీ అవ‌స‌రం ఉన్నాయి. చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు (కండువా మార్చిన వారితో కూడా. వారు అధికారికంగా టీడీపీనే). అలానే ముగ్గురు ఎంపీలుఉన్నారు.

బాబు అవసరం….

సో.. చంద్రబాబు అవ‌స‌రం బీజేపీకి ఎంతో ఉంది. ఎందుకంటే.. ఉత్త‌రాదిన బీజేపీ బ‌ల‌హీన‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీ వంటి కీల‌క‌మైన త‌ట‌స్థ ప్రతిప‌క్షాలు ఉన్న రాష్ట్రాల‌పై బీజేపీ పెద్ద ఎత్తున న‌మ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో మ‌రి బీజేపీ నాలుగు మెట్లు దిగుతుందా? లేక‌.. చంద్రబాబే దిగి వ‌చ్చి బీజేపికి మ‌ద్దతు ప్రకటిస్తారా? ఇవ‌న్నీ కాకుండా.. ఇరు పార్టీలూ బెట్టుతో మూతి ముడుచుకుంటాయా? అనేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా.. ఇరువురికి కూడా ఈ ప‌రిణామం అగ్ని ప‌రీక్షే!

Tags:    

Similar News