జగన్ చేసిన ప్రయోగం చంద్రబాబు చేస్తారా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అన్ని పార్టీల వ్యూహాలపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి [more]
;
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అన్ని పార్టీల వ్యూహాలపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అన్ని పార్టీల వ్యూహాలపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి ఉంది. పాత సంప్రదాయం ప్రకారమే వెళతారా? కొత్త రక్తాన్ని తెరపైకి తెస్తారా? అన్నది పార్టీలో పెద్ద డిస్కషన్ అయింది.
అందరూ కొత్త వాళ్లే….
గత ఎన్నికల్లో జగన్ చాలా వరకూ కొత్త వారికి ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు. నందిగం సురేష్, లావు శ్రీకృష‌్ణదేవరాయలు, మార్గాని భరత్, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాని చంద్రశేఖర్, గొట్టేటి మాధవి, సత్యవతి, చింతా అనురాధ, కోటగిరి శ్రీధర్, డాక్టర్ సంజీవ్ కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ దాదాపు 90 శాతం కొత్తవారే. యువతే అధికంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రయోగమే. అయితే జగన్ హవాలో వీరంతా విజయం సాధించి ఎంపీలు అయి తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం పాత తరం వారికే టిక్కెట్లు ఇచ్చి గత ఎన్నికల్లో భంగపడ్డారు. మూడు పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పాతవారికే…?
చంద్రబాబు గత ఎన్నికల్లోనూ పాత పద్ధతుల్లోనే ఎక్కువ మంది మాజీలకు టిక్కెట్లు ఇచ్చారు. వీరంతా గతంలో ఎంపీలుగా చేసిన వాళ్లే. వారి పాలన ప్రజలు చూశారు. జగన్ కొత్త వారిని పెట్టడంతో మొన్నటి ఎన్నికలలో ప్లస్ అయింది. ఎంపీల అభ్యర్థుల ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా సహజంగానే పడుతుంది. దీంతో ఈసారి ఎంపీ అభ్యర్థులను కొత్త వారికి ఇవ్వాలన్న డిమాండ్ బాగా విన్పిస్తుంది.
వారికి ఇస్తే…?
ఇటీవల చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులను నియమించారు. వారంతా కొత్తవారు. యువకులే. వీరినే అభ్యర్థులుగా చేస్తారంటూ ప్రచారం ఉంది. అయితే వీరిలో ఎక్కువ మంది పార్లమెంటు అభ్యర్థిగా సరిపోరన్న టాక్ ఉంది. దీంతో కొత్తవారిని ఎంపిక చేయాలని పలువురు చంద్రబాబుకు సూచిస్తున్నారు. అయితే ఆర్థికంగా బలమైన, యువనేతలకు అప్పగించాలన్నది చంద్రబాబు యోచన. మరి ఎన్నికల సమయానికి జగన్ చేసిన ప్రయోగం చంద్రబాబు చేస్తారా? అన్నది అనుమానమే.