ఆ నేతతో చంద్రబాబు బలవంతపు సంసారం
ఇష్టంలేని మొగుడితో సంసారం ఎన్ని రోజులని చేస్తాం.. చేసినా ఎంత వరకు అని సుఖపడతాం అన్న నానుడి మన తెలుగు నాట బాగా పాపులర్. ఇప్పుడు ఓ [more]
;
ఇష్టంలేని మొగుడితో సంసారం ఎన్ని రోజులని చేస్తాం.. చేసినా ఎంత వరకు అని సుఖపడతాం అన్న నానుడి మన తెలుగు నాట బాగా పాపులర్. ఇప్పుడు ఓ [more]
ఇష్టంలేని మొగుడితో సంసారం ఎన్ని రోజులని చేస్తాం.. చేసినా ఎంత వరకు అని సుఖపడతాం అన్న నానుడి మన తెలుగు నాట బాగా పాపులర్. ఇప్పుడు ఓ టీడీపీ నాయకుడు కూడా పార్టీలో కీలక పదవిలో ఉంటూ ఇదే తరహాలో ఉంటున్నారట.. కాదు కాదు ఆయన ఉంటున్నారు అనడం కంటే చంద్రబాబే టీడీపీలో ఆయనతో బలవంతపు సంసారం చేయిస్తున్నారనే చర్చలు ఆ జిల్లాలో వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం టీడీపీకి ఎప్పుడూ పెద్దగా అచ్చిరాదు. అక్కడ పార్టీకి 20 ఏళ్లలో సరైన నాయకుడు తయారు కాలేదు. చివరకు గత రెండు ఎన్నికల్లోనూ విజయవాడకు చెందిన ( గన్నవరం మాజీ ఎమ్మెల్యే) ముద్దరబోయిన వెంకటేశ్వరరావును బలవంతంగా అక్కడ పోటీ చేయిస్తున్నారు. నాన్ లోకల్, పార్టీలతో సంబంధం లేని నేతలను చంద్రబాబు ఎప్పుడూ తమ నెత్తిపై రుద్దుతూ ఉండడంతో వాళ్లు విసిగిపోయి పార్టీ అభ్యర్థి గెలుపుకోసం అంకిత భావంతో పనిచేయడం లేదు.
గతి.. గత్యంతరం లేక…..
ఇక గతంలో ఇండిపెండెంట్‌గా ( కాంగ్రెస్ సపోర్ట్‌తో) గన్నవరంలో ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్దరబోయిన 2009లో కాంగ్రెస్ నుంచి అదే గన్నవరంలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు సుజనా చౌదరితో ముద్దరబోయిన చేసిన లాబీయింగ్‌తో నూజివీడు సీటు దక్కింది. ఆయన మాకు వద్దు బాబోయ్ నాన్ లోకల్ అని మొత్తుకున్నా కూడా ముద్దరబోయినను నూజివీడు పార్టీ కేడర్‌పై చంద్రబాబు బలవంతంగా రుద్దేశారు. పార్టీ గెలిచినా అక్కడ ముద్దరబోయిన ఓడిపోయారు. ఇక గత ఎన్నికలకు ముందు ఆయనకు సీటు ఇస్తే చిత్తుగా ఓడిస్తామని మరోసారి కేడర్ శపథం చేసింది. అయినా చంద్రబాబు గతిలేకో.. గత్యంతరం లేకో .. లేదా ఎలాగూ పోయే సీటు అనో ముద్దరబోయిన్నే రంగంలోకి దింపారు. మరోసారి ఆయన ఓడిపోయారు.
కమ్మ వర్గం సయితం…
గత ఎన్నికల్లో టీడీపీని అభిమానించే కమ్మ వర్గం నేతలే ముద్దరబోయినకు సపోర్ట్ చేయడం ఇష్టం లేక పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకు సహకరించింది. ఇక ముద్దరబోయిన నూజివీడులో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కుల రాజకీయాలకు తెరలేపారన్న టాక్ కూడా ఉంది. ఆయన ఓ కులానికి ప్రాధాన్యత ఇస్తూ .. పార్టీకి బలంగా ఉండే మిగిలిన కులాలను పక్కన పెట్టడం కూడా ఆయన్ను పార్టీ కేడర్‌కు దూరం చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఓన్ చేసుకోకపోయినా…?
అసలు నూజివీడు టీడీపీ కేడర్ ఆయన్ను తమ పార్టీ నేతగా 8 ఏళ్లుగా కూడా ఓన్ చేసుకవడం లేదు. అలాంటి సమయంలో నూజివీడు కేడర్ ముద్దరబోయినను తప్పించాలని చెపుతున్నా కూడా చంద్రబాబు బలవంతంగా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఇప్పుడున్న కష్టకాలంలో చంద్రబాబు ఏం చేయలేని దుస్థితి. అక్కడ ఆయన్ను తప్పిస్తే.. ఆ మాత్రం కూడా పైసలు విదిల్చే నాయకుడు లేడనే చంద్రబాబు నూజివీడు పార్టీ కేడర్ ఘోషను వినీవిననట్టే వదిలేస్తున్నారు.