రెండేళ్లలో బాబుకు దగ్గరయిన ఆ ఇద్దరు…?
రాజకీయాలన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకే పార్టీ కూడా అధికారంలో నిరంతరం కొనసాగదు. ఓటమి-గెలుపు అనేవి.. నాణేనికి రెండు వైపుల ఉన్నట్టే పార్టీలకు కూడా ఉంటాయి. ప్రస్తుతం [more]
;
రాజకీయాలన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకే పార్టీ కూడా అధికారంలో నిరంతరం కొనసాగదు. ఓటమి-గెలుపు అనేవి.. నాణేనికి రెండు వైపుల ఉన్నట్టే పార్టీలకు కూడా ఉంటాయి. ప్రస్తుతం [more]
రాజకీయాలన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకే పార్టీ కూడా అధికారంలో నిరంతరం కొనసాగదు. ఓటమి-గెలుపు అనేవి.. నాణేనికి రెండు వైపుల ఉన్నట్టే పార్టీలకు కూడా ఉంటాయి. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఇప్పుడు భాగా శ్రమిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. జగన్ పాలనలోని లోపాలను ఎండగడుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అమరావతి విషయం టీడీపీకి కలిసి వస్తుందని.. మధ్యతరగతి ఓట్లు ఖచ్చితంగా టీడీపీకేనని ప్రచారం జరుగుతోంది. పైగా వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు ఆఖరి ఎన్నికలు కావచ్చు. దీంతో చంద్రబాబుతో పాటు పార్టీ నాయకులు చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు.
అధికారంలోకి వస్తే…?
ఈ నేపథ్యంలో చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే.. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోవడం ఖాయం. ఇక, ఈయన కేబినెట్‌లో ఎవరుంటారు ? అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. ఓ ఇద్దరి పేర్లు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. అవే.. ఒకటి నిమ్మల రామానాయుడు, రెండు అనగాని సత్యప్రసాద్. ఈ ఇద్దరూ కూడా వరుస విజయాలు దక్కించుకుని దూకుడుగా ముందుకు సాగుతున్న వారే. అదేవిధంగా.. ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాలనే కాకుండా.. జిల్లాల సమస్యలపైనా స్పందిస్తున్నారు. పాలకొల్లు నుంచి వరుస విజయం దక్కించుకున్న నిమ్మల విషయాన్ని పరిశీలిస్తే.. ఆయన అటు అసెంబ్లీలోనూ ప్రభుత్వంపై దూకుడుగా ఉన్నారు. గత సభలో ఆయనను స్పీకర్ సస్సెండ్ చేయడం కూడా సర్కారుపై దూకుడుగా ఉన్నందునేనన్న విషయం తెలిసిందే.
కష్టపడే నేతగా…..
ఇక, నియోజకవర్గంలోను రామానాయుడు.. దూకుడుగానే ఉన్నారు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్నారు. పార్టీ తరఫున చాలా కష్టపడుతున్నారు. రామానాయుడే డేరింగ్ మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో రామానాయుడుకు మంత్రి పీఠం రిజర్వ్ అయిందని అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రామానాయుడుకు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని మరింత ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. కాపుల్లో తూర్పు నుంచి చినరాజప్ప, నిమ్మల మాత్రమే వరుసగా గెలవడంతో పాటు చంద్రబాబుకు నమ్మకంగా ఉన్నారు.
నమ్మకమైన నేతగా….
ఇక, అనగాని విషయానికి వస్తే.. ఈయన కూడా సీఎం జగన్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్క ఆయన నియోజకవర్గంలోనే కాకుండా.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా.. ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గ నేతలు అందరూ ఓడిపోయినా అనగాని వరుసగా రెండోసారి గెలిచారు. బీసీల్లో బలమైన గౌడ వర్గం నుంచి సీనియర్ నేతగా ఉన్నారు. దీంతో బీసీ కోటాలో అనగానికి తప్పకుండా మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి గట్టి వాయిస్ వినిపిస్తున్న వారికి చంద్రబాబు అధికారంలోకి వస్తే గట్టిమేల్ జరుగుతుందనే కామెంట్లు పార్టీలో వినిపిస్తుండడం గమనార్హం.