బాబు న్యూ స్ట్రాటజీ… సీనియర్లకు నో.. కొత్తవారికే ఛాన్స్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలు చావోరేవో అని చెప్పకతప్పదు. ఈ ఎన్నికల్లో విక్టరీ మిస్ అయితే పార్టీ మనుగడ కూడా కష్టమే. అందుకే చంద్రబాబు [more]

;

Update: 2021-07-11 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలు చావోరేవో అని చెప్పకతప్పదు. ఈ ఎన్నికల్లో విక్టరీ మిస్ అయితే పార్టీ మనుగడ కూడా కష్టమే. అందుకే చంద్రబాబు మూడేళ్ల ముందు నుంచే అన్ని రకాల ఈక్వేషన్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జగన్ ప్రస్తుతం అన్ని రకాలుగా బలవంతుడు. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ ను తట్టుకోవాలంటే అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను సమకూర్చుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన.

ఆర్థికంగా ఇబ్బందులతో….

జగన్ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. దీంతో అనేక మంది నేతలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సహజంగానే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఆ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. 2014 ఎన్నికల్లో కొన్ని తప్ప మెజారిటీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు వైసీపీకే దక్కాయి. 2019 లో కూడా అదే పరిస్థితి. ఇందుకోసం చంద్రబాబు ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది.

కొత్తనేతకే అవకాశం….

పాత నేతల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తే కొంత ఫలితం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. సీనియర్ నేతలనుకూడా పక్కన పెట్టాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే యర్రగొండపాలెంకు ఎరిక్సన్ బాబును ఇన్ ఛార్జిగా నియమించారు. ఎరిక్సన్ బాబుది కనిగిరి నియోజకవర్గం. అయితే పార్టీనే నమ్ముకుని ఉండటంతో అక్కడ ఉన్న వారిని కాదని, తిరిగి పార్టీలోకి వచ్చిన డేవిడ్ రాజును కాదని ఎరిక్సన్ బాబుకు అప్పగించారు. యువకుడు కావడంతో కొంత పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఆర్థికంగా బలమైన….

ఇక తిరువూరు నియోజకవర్గంలో అయితే సీనియర్ నేతలు స్వామిదాస్ కు చంద్రబాబు మళ్లీ ఝలక్ ఇచ్చారు. ఇక్కడ ఇన్ ఛార్జిగా దేవదత్ ను నియమించారు. ఎన్నారై కావడంతో ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయనను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కొన్ని కీలకమైన వాటిల్లో సీనియర్లను పక్కన పెట్టి కొత్తవారిని ఎంపిక చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రస్తుతం చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. మరి ఈ ప్రయోగం ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News