బాబును ఆ భ్రమల్లోనే ఉంచుతున్నారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వాస్తవం అర్థం కావడం లేదు. జగన్ ప్రభుత్వంపైన వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న భ్రమల్లో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు మాత్రం [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వాస్తవం అర్థం కావడం లేదు. జగన్ ప్రభుత్వంపైన వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న భ్రమల్లో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు మాత్రం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వాస్తవం అర్థం కావడం లేదు. జగన్ ప్రభుత్వంపైన వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న భ్రమల్లో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు మాత్రం పరిస్థితి అర్థమవుతుంది. అందుకే పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు సీనియర్ నేత. ఆయనకున్న రాజకీయ అనుభవం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు. కానీ కాలం మారింది. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. గత రెండేళ్ల నుంచి చంద్రబాబు పెద్దగా ప్రజల్లో పర్యటించింది లేదు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
బాబు అంచనా……
మూడు రాజధానుల వ్యవహారం, మద్యం, ఇసుక పాలసీ, టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు వంటివి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను తెస్తాయని చంద్రబాబు అంచనా వేశారు. వ్యతిరేకత వచ్చిందనే చంద్రబాబు భావిస్తున్నారు. ఆయనకు వచ్చే నివేదికల్లో కూడా అవే ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మాదిరిగానే చంద్రబాబును కొందరు భ్రమల్లో ఉంచుతున్నారన్నది ఇట్టే అర్థమవుతుంది. అనుకూల మీడియా కూడా అలాగే ఫోకస్ చేస్తుంది
ఏ అంశం కూడా…?
అంత వ్యతిరరేకత ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకే ప్రజలు పట్టంకట్టడం వంటివి కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే చెబుతున్నారు. కానీ నేతలు మాత్రం పెద్దగా లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ వంటి ఏ అంశం కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపలేదు. చంద్రబాబు ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని 175 నియోజకవర్గాల్లో చేపట్టాలని పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయిలో మాత్రం….?
కానీ దీనికి పెద్దగా స్పందన కన్పించలేదు. ముఖ్యమైన ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల నేతలు మమ అనిపించారు. పదిమందితో నిరసనలు తెలియచేసి కెమెరా ముందు కన్పించి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఇంకా సమయం పడుతుందని అనేక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ తమ అధినేత చంద్రబాబును కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, భ్రమల్లో ఉంచుతున్నారని టీడీపీకి చెందిన ఒక నేత చెబుతుండటం విశేషం. మొత్తం మీద అధికారంలో ఉన్నమాదిరిగానే ఒక బలమైన కోటరీ చంద్రబాబును ఇప్పటికీ భ్రమల్లో ఉంచుతుందన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది.