టీడీపీ లెక్కలు.. 75 గ్యారెంటీ అట‌

రాజ‌కీయాల్లో హ‌త్యలు ఉండ‌వు.. ఆత్మహ‌త్యలే ఉంటాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి అధికారంలో ఉన్న టీడీపీ.. మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్నప్పటికీ.. చేజేతులా అవ‌కాశాన్ని [more]

;

Update: 2021-07-24 00:30 GMT

రాజ‌కీయాల్లో హ‌త్యలు ఉండ‌వు.. ఆత్మహ‌త్యలే ఉంటాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి అధికారంలో ఉన్న టీడీపీ.. మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్నప్పటికీ.. చేజేతులా అవ‌కాశాన్ని జార విడుచుకుంద‌ని ప‌రిశీల‌కులు అప్పట్లోనే చెప్పారు. దీనికి ప్రధానంగా బంధుప్రీతి (కుమారుడికి మంత్రి ప‌ద‌వి ఇవ్వడం), ఉదాసీన‌త (నేత‌లు చెల‌రేగిపోయినా.. చూస్తూ ఉండ‌డం), అవినీతి (దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా చ‌ర్యలు చేప‌ట్ట‌క‌పోవ‌డం), చంద్రబాబు అవుట్ డేటెడ్ నిర్ణయాలు వంటివి పార్టీని దెబ్బతీశాయ‌ని అప్పట్లోనే విశ్లేష‌ణ‌లు సాగాయి. అయితే.. ఇప్పుడు వీటిపై దృష్టి పెట్టిన చంద్రబాబు బంధు ప్రీతి మిన‌హా.. మిగిలిన స‌మ‌స్యల ప‌రిష్కారంపైదృష్టి పెట్టారు.

నిజాయితీతో పనిచేసి….

గ‌త ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉండి.. అవినీతికి తావులేకుండా వ్యవ‌హ‌రించిన వారు.. ఎమ్మెల్యేలుగా ఉంటూ.. పార్టీ కోసం కృషి చేసిన వారి జాబితాను చంద్రబాబు తెప్పించుకున్నారు. అదేస‌మ‌యంలో టీడీపీ గుర్తింపు ఇచ్చినా ఇవ్వక‌పోయినా.. ప్రజ‌ల మ‌ధ్యే ఉన్న నాయ‌కుల వివ‌రాలు తెప్పించుకున్నార‌ట‌. ఇదంతా ప‌రిశీలించి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చంద్రబాబు ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా చంద్రబాబుతెప్పించుకున్న జాబితాలో.. 75 మంది పేర్లు ఉన్నట్టు చ‌ర్చ సాగుతోంది. వీరంతా చాలా నిజాయితీగా వ్యవ‌హ‌రించార‌ని.. అదే స‌మ‌యంలో పార్టీ కోసం ప‌నిచేశార‌ని ఒక నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే.. వీరిలో మెజారిటీ నేత‌లు..లోకేష్ నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్ధిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో…..

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డం చాలా ఈజీయేన‌ని చంద్రబాబు ఒక నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. వీరిలో కొంద‌రి పేర్లు కూడా వెల్లడి అవుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. అధికారంలోకి వ‌చ్చేందుకు 88 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌రం. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్ర‌కారం 75 మంది నిజాయితీప‌రులైన, పార్టీ కోసం క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేసే నాయ‌కులు తేలారు. వీరితోపాటు.. కొత్తగా .. మ‌రికొంద‌రిని త‌యారు చేసుకుంటే.. ఇక‌, అధికారం త‌మ‌వ‌శ‌మే అవుతుంద‌ని చంద్రబాబు భావిస్తున్నట్టు స‌మాచారం.

ఇరవై ఏళ్లుగా గెలవని….

ఒక‌వైపు ప్రజ‌ల్లో ఉంటూ.. మ‌రో వైపు నిజాయితీ ప‌రులైన నేత‌ల‌ను ప్రోత్సహించ‌డం ద్వారా.. జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌నేది చంద్రబాబు వ్యూహంగా ఉంద‌ని త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. అదే స‌మ‌యంలో పార్టీ 20 ఏళ్లుగా గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్లను ప‌క్కన పెట్టేసి… త‌ట‌స్థ నేత‌ల‌ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు టీం క‌స‌ర‌త్తులు చేస్తోంది. మ‌రి ఇది వ‌ర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News