అక్కడ కూడా వారిదే పెత్తనమా…. బాబు మళ్లీ సేమ్ మిస్టేక్ ?
ఏపీలో గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనపడడం లేదు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ తప్పులు చేశాం ? వాటిని ఎలా [more]
;
ఏపీలో గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనపడడం లేదు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ తప్పులు చేశాం ? వాటిని ఎలా [more]
ఏపీలో గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనపడడం లేదు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ తప్పులు చేశాం ? వాటిని ఎలా సరిదిద్దుకుని అధికారంలోకి వద్దాం ? అన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు లేదు. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పులు చేశారో ? అవే తప్పులు ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత మొత్తం 30 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇన్‌చార్జ్‌లను క్రమక్రమంగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలకు చెందిన నేతలు ( కమ్మ వర్గం ) నేతలకు సర్దిచెప్పలేని బాబు అక్కడ ఎస్సీ వర్గానికి చెందిన నేతలకు కాకుండా తన కులానికి చెందిన నేతలతో త్రీ మెన్ కమిటీలు వేయడం.. లేదా ఓసీ వర్గానికి చెందిన నేతలకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న పరిస్థితే ఉంది.
ఇన్ ఛార్జిల విషయంలో…?
ఉదాహరణకు గత ఎన్నికల్లో అప్పటి వరకు మంత్రిగా ఉన్న కేఎస్. జవహర్‌ను కొవ్వూరులో కాదని కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారు. కేవలం అక్కడ కమ్మ వర్గం నేతల ఒత్తిడితోనే ఎస్సీ వర్గంలో మంత్రిగా ఉండి పార్టీకి కమిటెడ్‌గా వాయిస్ వినిపించిన జవహర్ సీటు మార్చేశారు. ఇప్పటికీ కొవ్వూరును అదే కమ్మ నేతల ప్రాపకం కోసం ఖాళీగా ఉంచారే కానీ.. అక్కడ ఇన్‌చార్జ్‌ను చంద్రబాబు పెట్టడం లేదు. ఇక మరో ఎస్సీ నియోజకవర్గం అయిన తిరువూరు విషయంలో ఎట్టకేలకు నాన్చి నాన్చి ఎన్నారై దేవదత్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చారు.
ఇక్కడా సేమ్ సీన్….
ఇక పాయకారావుపేటలోనూ సేమ్ సీన్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత బలంగా వాయిస్ వినిపించారు. చివర్లో అక్కడ ఓ అగ్ర వర్ణ నేతల ఒత్తిడితోనే ఆమెను రెండు, మూడు జిల్లాలు దాటించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో చంద్రబాబు పోటీ చేయించారు. ఇప్పుడు మళ్లీ ఆమెకు అక్కడే పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోనూ అదే పరిస్థితి ఉంది. అక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కర్రా రాజారావు మృతి చెందారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుజాతతో పాటు మాజీ జడ్పీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆకుమర్తి రామారావు లాంటి ఎస్సీ నేతలు ఇన్‌చార్జ్ పదవి రేసులో ఉన్నారు.
ఇక్కడా వారిదే హడావిడి..?
అయితే ఇక్కడ కూడా కమ్మ నేతల హడావిడి, పెత్తనంతోనే సుజాత మంత్రిగా ఉన్నప్పుడు పార్టీని బ్రష్టు పట్టించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు చింతలపూడి వ్యవహారాల్లో కమ్మ నేతలతో కలిసి పదే పదే దూరిపోయేవారు. చివరకు టీడీపీ పుట్టాక ఎప్పుడూ లేనంతగా ఏకంగా 36 వేల ఓట్ల తేడాతో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఇన్‌చార్జ్‌గా ఎవరో ఒక ఎస్సీ నేతకు ఇస్తే పార్టీని ట్రాక్‌లోకి ఎక్కిస్తారు. కానీ ఇక్కడ కూడా చంద్రబాబు తన సామాజిక వర్గ నేతల ఒత్తిడికి తలొగ్గి త్రీమెన్ కమిటీ వేయడమో లేదా… ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడమో చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. ఇక ఎన్నికలకు ముందు ఎవరో ఒకరిని తీసుకువచ్చి పోటీ చేయిద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నారట. జరుగుతోన్న పరిణామాలపై ఎస్సీ నేతలు అందరూ కక్కలేక మింగలేని చందంగా ఉన్నారు. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరి చంద్రబాబు ఎస్సీ నియోజకవర్గాల విషయంలో అగ్రవర్ణ నేతల పెత్తనానికి చెక్ పెట్టకపోతే పార్టీకి ఇబ్బంది తప్పదు.