చంద్రబాబు ఆమెతో అదే చెప్పారా?

ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితి బాగోలేదు. ఎక్కడిక‌క్కడ నాయ‌కులు నిరాశ‌లో కూరుకుపోయారు. త‌మ‌కు గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని.. తాము ఎంత క‌ష్టప‌డుతున్నా ప్రయోజ‌నం లేకుండా పోయింద‌ని.. క‌నీసం పార్టీలో [more]

Update: 2021-07-29 09:30 GMT

ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితి బాగోలేదు. ఎక్కడిక‌క్కడ నాయ‌కులు నిరాశ‌లో కూరుకుపోయారు. త‌మ‌కు గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని.. తాము ఎంత క‌ష్టప‌డుతున్నా ప్రయోజ‌నం లేకుండా పోయింద‌ని.. క‌నీసం పార్టీలో కార్యక‌ర్తలు కూడా త‌మ‌ను గుర్తించ‌డం లేద‌ని చాలా మంది నేత‌లు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఇక‌, పార్టీలో కొత్తగా చేరిన వారు.. వైసీపీ నుంచి వ‌చ్చిన వారి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. ఈ క్రమంలో గ‌ట్టి వాయిస్ ఉన్న నాయ‌కులు కూడా మౌనంగా ఉంటున్నారు. పార్టీ అధినేత త‌మ‌ను క‌నీసం ప‌ట్టించుకునే తీరిక కూడా ఉండ‌డం లేద‌నివారు వాపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌ని డైలమా స్థితి ఎదుర్కొంటున్నారు.

వైసీపీ నుంచి టీడీపీ లో చేరి…..

ఇలాంటి వారిలో గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక‌రు. గ‌తంలో జ‌గ‌న్ కు ఎంతో స‌మ‌ర్ధించిన ఈశ్వరి.. 2017-18 మ‌ధ్య వైసీపీని వ‌దిలి టీడీపీలోకి చేరిపోయారు. ఈ క్రమంలోనే గిరిజ‌న సంక్షేమ కార్పొరేష‌న్ చైర్మన్ గిరీ ఆమెకు ఇస్తార‌నే ప్రచారం జ‌రిగింది. అయితే.. చంద్రబాబు ఆమెను ప‌క్కన పెట్టారు. నిజానికి వైసీపీలో మంచి గుర్తింపు.. జ‌గ‌న్ ద‌గ్గర మంచి మార్కులు ఉన్నప్పటికీ.. ఆమె టీడీపీ ఇచ్చిన ఆఫ‌ర్‌తోనే బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని.. చంద్రబాబు చెంత‌కు నిలిచార‌ని అప్పట్లోనే చ‌ర్చ సాగింది.

బాక్సైట్ తవ్వకాలపై…?

ఇక‌, ఆ త‌ర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవ‌డం, గిడ్డి ఈశ్వరి టీడీపీ టికెట్‌పై పోటీ చేసినా.. ఓడిపోవడం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. వాస్తవానికి ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా గిడ్డి ఈశ్వరికి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా బాక్సైట్ త‌వ్వకాల‌పై ఆమె ఎప్పటి క‌ప్పుడు ఉద్యమించారు. కానీ, గ‌డిచిన రెండేళ్లుగా ఆమె అడ్రస్ ఎక్కడా క‌నిపించ‌లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆమెకు ఫోన్ చేసి.. భ‌రోసా ఇచ్చార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రాగానే.. మంత్రి ప‌ద‌విని ఇస్తామని చెప్పారని. టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నారు.

అందుకే యాక్టివ్ అయ్యారని….

దీనికి మ‌ద్దతుగా ఆమె తాజాగా మీడియా ముందుకు రావ‌డం.. వారం ప‌దిరోజులుగా యాక్టివ్ అయ్యారు. మ‌రి చంద్రబాబు ఇచ్చిన హామీతోనే ఆమె యాక్టివ్ అయ్యార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల వేళ పాడేరు స‌మీక‌ర‌ణలు ఎలా ? ఉంటాయో ? గిడ్డి అక్కడ గెలిచి నిలుస్తారా ? బాబు మ‌ళ్లీ సీఎం అవుతారా ? ఆమెకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ? అన్నదానికి కాల‌మే ఆన్సర్ చెప్పాలి.

Tags:    

Similar News