బాబు క్లారిటీ ఇస్తేనే తప్ప… ?

చంద్రబాబు మళ్లీ హుషార్ చేస్తున్నారు. ఏపీ రాజధాని వీధుల్లో తెగ హల్ చల్ చేస్తున్నారు. వచ్చేది మా సర్కారే అంటూ హూంకరిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ [more]

Update: 2021-07-30 00:30 GMT

చంద్రబాబు మళ్లీ హుషార్ చేస్తున్నారు. ఏపీ రాజధాని వీధుల్లో తెగ హల్ చల్ చేస్తున్నారు. వచ్చేది మా సర్కారే అంటూ హూంకరిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ క్యాడర్ మాత్రం పడకేస్తోంది. చంద్రబాబుకు ఉన్న ధీమా వారికి లేదా అంటే అదొక్కటే కాదు, చాలా విషయాల్లొ వారికి డౌట్లు ఉన్నాయట. చంద్రబాబు మాత్రం జగన్ పని అయిపోయింది మనదే రాజ్యం అని మాత్రమే చెబుతున్నారు. దాని కంటే ముందు చంద్రబాబు తమ్ముళ్లకు చెప్పాల్సిన మరో ముఖ్య విషయం ఉంది. అలాగే ఇవ్వాల్సిన క్లారిటీ కూడా చాలానే ఉంది అంటున్నారు.

అదే రీజన్ …

నిజం చెప్పాలంటే టీడీపీలో కొందరు యువ నాయకులకు తప్ప సీనియర్లతో సహా కీలకమైన నేతలకు లోకేష్ నాయకత్వం మీద పెద్దగా నమ్మకం లేదు. లోకేష్ గురించి వారికి బాగా తెలుసు అంటున్నారు. లోకేష్ గత అయిదేళ్ల టీడీపీ సర్కార్ లో కీలకంగానే వ్యవహరించారు. మూడేళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వ్యవహారశైలి కూడా టీడీపీ నాయకులకు బాగా అవగాహన ఉంది. అందుకే లోకేష్ అంటేనే వారు వెనక్కు తగ్గుతున్నారు. అంటే టీడీపీలో నాయకత్వ సంక్షోభం మీదనే వారిలో అలా బెంగ ఉందిట. ఇది చంద్రబాబును ఇబ్బంది పెడుతుంది.

వద్దు అన్నదే వాదన ….

ఇక లోకేష్ నాయకత్వం వద్దే వద్దు అన్నది మెజారిటీ టీడీపీ వాయిస్ గా కూడా ఉందని అంటున్నారు. చంద్రబాబు అంటే తమకు గౌరవమని, ఆయన లీడర్ షిప్ లో ఎలాంటి జంకూ గొంకూ లేకుండా పనిచేస్తామని కూడా చెబుతున్నారు. కానీ చంద్రబాబు ఆలోచనాధోరణి వేరేగా ఉందనే సీనియర్లు అనుమానిస్తున్నారు. టీడీపీ కోసం తీరా అంతా కష్టపడితే పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ కి పగ్గాలు చంద్రబాబు అప్పగిస్తే తమ గతేం కాను అన్నదే సీనియర్ల నిలువెత్తు ప్రశ్నగా ఉందిట. ఉత్తరాంధ్రా జిల్లాలో చూసుకుంటే పలువురు మాజీ మంత్రులతో సహా చాలా మంది సీనియర్లకు లోకేష్ అంటే ఇష్టం లేదు అని చెబుతారు. ఇదే పరిస్థితి ఏపీవ్యాప్తంగా ఉందని కూడా అంటున్నారు.

ఆ సంగతి తెలిసే ….?

ఇక చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాల్సిందే. లేకపోతే పార్టీ పోయినట్లే అన్నది. ఇక టీడీపీ పవర్ లోకి వచ్చేంతవరకే తన ఫేస్ చూపిస్తారుట చంద్రబాబు. అంటే అటు జనాలు, ఇటు పార్టీలోని సీనియర్లు కూడా అయిదేళ్ళూ బాబే సీఎం గా ఉంటారని భావించే ఓటేయాలి. కానీ చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది రెండేళ్లలోనే లోకేష్ నెత్తిన కిరీటం పెట్టి తాను రిటైర్ అవుతారు అంటున్నారు. అంటే లోకేష్ సీఎం అని బయటకు చెబితే ఇటు పార్టీ కదలదు, అటు జనాలు ఓటేయరు కాబట్టి తానే సీఎం అని చంద్రబాబు 2024లో చెబుతారు అంటున్నారు. పార్టీ జనాలకు ఈ సంగతి తెలియడంతోనే వారు సైలెంట్ అయ్యారు అంటున్నారు. చంద్రబాబు ముందు వారికి క్లారిటీ ఇచ్చి తానే టీడీపీకి అయిదేళ్ల సీఎం అని నమ్మకం కలిగిస్తే తప్ప పార్టీలో అసలైన కదలిక రాదు అని అంటున్నారు. చూడాలి మరి బాబు తన చాణక్య రాజకీయంతో తమ్ముళ్ళను ఎలా దారికి తెస్తారో.

Tags:    

Similar News