బాబు ఫుల్ హ్యాపీస్… కారణమిదేనట

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అన్ని రకాలుగా కష్టాల్లో ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని గాడిన పెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నస్తున్నా [more]

Update: 2021-08-04 13:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అన్ని రకాలుగా కష్టాల్లో ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని గాడిన పెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నస్తున్నా ఫలితం కన్పించడం లేదు. నాయకులు ఎవరూ పార్టీ కోసం ముందుకు రావడం లేదు. అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నా భవిష్యత్ లో కొంత పార్టీ పరిస్థిితి మెరుగుపడుతుందని చంద్రబాబు ఆశాభవాంతో ఉన్నారు.

టీడీపీ పరిస్థితి….

వైసీపీ ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేకనే టీడీపీ నేతలు మౌనంగా ఉంటున్నారన్నది వాస్తవం. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నియోజకవర్గాల పెంపుదల ఇప్పుడు జరగదని తెలియడంతో చంద్రబాబు సంతోషంగా ఉన్నారు. 175 నియోజకవర్గాలతోనే వచ్చే ఎన్నికలు కూడా జరుగుతుండం తనకు లాభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

పెంపు ఉంటుందని…..

ఒకటి నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడి అనేక మంది నేతలు వైసీపీలో వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడు ఇక వెళ్లే ప్రసక్తి ఉండదు. తమ నియోజకవర్గాల్లోనే పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. వైసీపీకి ప్రత్యామ్నాయం తామే కనుక పార్టీ కార్యక్రమాలు కూడా నియోజకవర్గాల్లో ఇక పెరిగే అవకాశముంది. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం మాత్రమే ఉండటంతో సీటు కావాలని కోరుకునే వాళ్లు ఇప్పటి నుంచే కష్టపడక తప్పదు.

పెరిగితే ఇబ్బందే…

తనకు కూడా ఒక అడ్వాంటేజీ లభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే అక్కడ పరిస్థితులు మారి జగన్ కు లాభించే అవకాశముంది. ప్రస్తుతమున్న నియోజకవర్గాలే అయితే పార్టీపైనా, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో ప్రజలు తమ వైపు మొగ్గు చూపే అవకాశముందన్నది చంద్రబాబు విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తన హయాంలో జరగని పని జగన్ సీఎంగా ఉన్న సమయంలోనూ జరగకపోవడం చంద్రబాబుకు ఊరట నిచ్చే అంశమేనంటున్నారు.

Tags:    

Similar News