ఆ టీడీపీ నేత విషయంలో అంత పంతం ఎందుకు ?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఇటీవల ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. కరోనా అనంతరం.. జిల్లాల్లో పర్యటిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబుకు సీనియర్ల నుంచి అనేక విజ్ఞప్తులు [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఇటీవల ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. కరోనా అనంతరం.. జిల్లాల్లో పర్యటిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబుకు సీనియర్ల నుంచి అనేక విజ్ఞప్తులు [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఇటీవల ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. కరోనా అనంతరం.. జిల్లాల్లో పర్యటిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబుకు సీనియర్ల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. వీటిలో సాధ్యమైన వాటికి ఆయన అక్కడికక్కడే పరిష్కారం కూడా చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామమే.. ఏ సమస్యనైనా నాన్చడం అలవాటనే పేరున్న చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా సమస్యలను పరిష్కరిస్తున్నారనే పేరు రావడం వల్ల.. అనేక మంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి.. తమ సమస్యను చెప్పుకొంటున్నారు.
అందుబాటులో ఉండటం లేదని….
ఈ క్రమంలోనే చంద్రబాబు ఇటీవల గుంటూరు జిల్లాలో పర్యటించి.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను పరామర్శించారు. దీంతో గుంటూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పార్టీ సీనియర్లు గుట్టు చప్పుడు కాకుండా.. చంద్రబాబుకు ఆహ్వానం పలికే పేరిట అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో వారి సమస్యలు చెప్పుకొన్నారు. గుంటూరు నగరానికి చెందిన పార్టీ నాయకులు.. ఎంపీ గల్లా జయదేవ్‌పై ఫిర్యాదు చేశారు. తమకు అందుబాటులో ఉండడం లేదని.. పార్టీ నేతలకే ఆయన దర్శనం లభించడం లేదని చెప్పుకొచ్చారు.
కేశినేని నానిపై….?
దీంతో అదే పర్యటనలో చంద్రబాబు .. ఎంపీ గల్లాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. పార్లమెంటు సమావేశాలు మినహా మిగిలిన రోజుల్లో వారానికి ఒక్కరోజైనా.. పార్టీకి సమయం కేటాయించాలన్నారు. ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. ఇక, విజయవాడ ఎంపీ కేశినేని నానిపై కొందరు అసంతృప్తులు ఫిర్యాదుల చిట్టా అందజేశారు. దీనిలో ప్రధానంగా.. ఆయనకు ఉన్న పార్టీ అధికారాలను తగ్గించి నగర అధ్యక్షుడికి అప్పగించాలని కొందరు కోరారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో వేరే నాయకుడిని పరిశీలిస్తే.. మంచిదని కూడా సూచించారు. అయితే… ఎంపీ నానిపై చేసిన ఫిర్యాదులను మాత్రం చంద్రబాబు పక్కన పెట్టారు. పైగా.. సమన్వయంతో పని చేసుకోవాల్సిన సమయంలో ఫిర్యాదులు చేస్తారా ? అంటూ ఒకింత ఆగ్రహానికి గురయ్యారట.
నేతలు మాత్రం..?
అంతేకాదు.. కేశినేని నాని గురించి తనకు తెలుసునని.. మీరు సరిచేసుకోండని.. చెప్పడంతో విజయవాడ నుంచి ఎంతో ఆశతో గుంటూరుకు వెళ్లిన నాయకులు..చంద్రబాబుకు బై చెప్పి వచ్చేశారట. అంతేకాదు. ఇక ఈ నాయకులు అంతా అప్పటి నుంచి అసలు బయటకు కూడా రావడం లేదని తెలుస్తోంది. . మరి .. చంద్రబాబు నాని విషయంలో ఎందుకు ఇలా ఉన్నారనేది వీరికి అంతుచిక్కడం లేదు. “నాని తీరుతో పార్టీ నాశనం అవుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.“ అని విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా నాని విషయంలో విజయవాడ టీడీపీ నేతలు మాత్రం పెద్ద పంతంతోనే ఉన్నారు.