బాబు బస్సు యాత్ర… లోకేష్ సైకిల్ యాత్ర?
వచ్చే ఎన్నికలలో ఎలాగైనా టీడీపీని గెలిపించాలన్న పట్టుదలతో అధినాయకుడు చంద్రబాబు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. జనాలకు ఎలాగైనా చేరువ కావాలన్నది ఆయన ఆలోచన. వైసీపీ సర్కార్ మీద [more]
వచ్చే ఎన్నికలలో ఎలాగైనా టీడీపీని గెలిపించాలన్న పట్టుదలతో అధినాయకుడు చంద్రబాబు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. జనాలకు ఎలాగైనా చేరువ కావాలన్నది ఆయన ఆలోచన. వైసీపీ సర్కార్ మీద [more]
వచ్చే ఎన్నికలలో ఎలాగైనా టీడీపీని గెలిపించాలన్న పట్టుదలతో అధినాయకుడు చంద్రబాబు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. జనాలకు ఎలాగైనా చేరువ కావాలన్నది ఆయన ఆలోచన. వైసీపీ సర్కార్ మీద జనాల్లో వ్యతిరేకత ఉందని, పైగా తన లాంటి అనుభవశాలిని దూరం చేసుకున్నందుకు జనాలు బాధ పడుతున్నారని కూడా ఆయన అంచనా కడుతున్నారుట. దాంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటి నుంచి వివిధ అవకాశాలను చంద్రబాబు సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అంటున్నారు. అందులో భాగంగా చంద్రబాబు బస్సు యాత్రను చేపడతారు అంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో ఈ బస్సు యాత్ర సాగేలా రూపకల్పన చేసుకుంటారు అన్నది తాజాగా వినిపిస్తున్న టాక్.
మూడు రోజుల బస…
అంతే కాదు 2022 మధ్య నుంచి ఈ బస్సు యాత్ర మొదలై ఎన్నికలు జరిగేంతవరకూ సాగుతూనే ఉంటుంది అంటున్నారు. చంద్రబాబు ఈ బస్సు యాత్ర సందర్భంగా ప్రతీ నియోజకవర్గంలో కనీసం రెండు మూడు రోజులు బస చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సందర్భంగా పార్టీని ఎక్కడికక్కడ పటిష్టం చేయడంతో పాటు జనాలను కూడా తమ వైపుకు తిప్పుకోవడానికి ఇది ఉపకరిస్తుంది అని ఆయన భావిస్తున్నారుట. అయితే ఈ యాత్ర చేపట్టానికి ముందు ఏపీలో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ ఇన్‌చార్జ్‌లు ఉండేలా చూసుకునే ప్లాన్ కూడా జరుగుతోంది. అంటే వచ్చే ఎన్నికలకు ఇప్పుడే చాలా వరకు అభ్యర్థులను ఖరారు చేసేయడంతో పాటు వారి ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని కూడా చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు.
లోకేష్ కూడా..?
మరో వైపు లోకేష్ తో పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ చేయించాలి అన్నది కూడా చంద్రబాబు ఆలోచనట. పాదయాత్ర అయితే 2022 నుంచే మొదలు పెట్టాలి. దానికి అనువైన పరిస్థితులు లేకపోతే సైకిల్ యాత్రను చినబాబుతో చేయిస్తారు అంటున్నారు. యూత్ ని చినబాబు ద్వారా ఆకట్టుకోవడంతో పాటు తాను బస్సు యాత్రలో కవర్ చేయని ప్రాంతాలన్నీ లోకేష్ చుట్టబెట్టేలా ప్రణాళికలను చంద్రబాబు రెడీ చేసి ఉంచారట. మొత్తానికి టీడీపీ వచ్చే ఎన్నికలకు ఆయుధాలను రెడీ చేసుకుంటోంది. చంద్రబాబు, లోకేష్ విగరస్ గా తిరగడానికి జనాల్లో నిరంతరం ఉండడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి టీడీపీ విజయావకాశాలను ఈ యాత్రలు ఎంతవరకూ పెంచుతాయో చూడాలి.