బాబు లెక్క తప్పలేదు కదా? మళ్లీ జగన్ దరి చేర్చారా?

చంద్రబాబు తాను అనుకోకుండానే బీజేపీ ట్రాప్ లో పడిపోయినట్లు కన్పిస్తుంది. ఇక వెనక్కు తీసుకునే అవకాశమే లేకుండా పోయింది. చంద్రబాబుపై మొన్నటి వరకూ ఉన్న లౌకిక ముద్రను [more]

;

Update: 2021-01-17 08:00 GMT

చంద్రబాబు తాను అనుకోకుండానే బీజేపీ ట్రాప్ లో పడిపోయినట్లు కన్పిస్తుంది. ఇక వెనక్కు తీసుకునే అవకాశమే లేకుండా పోయింది. చంద్రబాబుపై మొన్నటి వరకూ ఉన్న లౌకిక ముద్రను ఆయనంతట ఆయనే చెరిపేసుకున్నారు. ఇప్పుడు కొన్ని వర్గాలను తనంతట తానే దూరం చేసుకున్న చంద్రబాబు హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా రాబట్టుకోగలారా? అన్న ప్రశ్న పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుండటం విశేషం.

ఊహించని విధంగా…..

చంద్రబాబు గత కొద్దిరోజులుగా హిందుత్వ అజెండాను ఎత్తుకున్నారు. రామతీర్థం కు స్వయంగా వెళ్లి హడావిడి చేశారు. అంతటితో ఊరుకోలేదు. ముఖ్యమంత్రి జగన్, హోం మంత్రి, డీజీపీ ముగ్గూరు క్రిస్టియన్లేనంటూ విమర్శలు చేశారు. వారివల్లనే ఏపీలో ఆలయాలపై వరస దాడులు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా జరిగిన ఘటనలపై తమకు నిష్పక్ష పాతంగా విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని కూడా చంద్రబాబు తెలిపారు.

ఆ రెండు వర్గాలు…..

అయితే చంద్రబాబు మాత్రమే కాదు… ఆయన పార్టీ నేతలందరూ ఇటువంటి ప్రకటనలే చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు చంద్రబాబుకు దూరమయినట్లేనంటున్నారు. నిజానికి క్రిస్టియన్లలో ఎక్కువ మంది వైసీపీ వైపే మొగ్గు చూపుతారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలన్నీ వైసీపీకి రావడమే ఇందుకు ఉదాహరణ. అయితే ఇటీవల జరిగిన సంఘటనలతో కొంత ఆ వర్గం టీడీపీ వైపు మొగ్గు చూపింది. కానీ చంద్రబాబు వ్యవహార శైలితో ఇప్పుడు ఆ వర్గం టీడీపీ వైపు చూడదంటున్నారు.

దూరమయిన వారిని దగ్గరగా చేర్చి…..

నిజానికి దళిత, మైనారిటీ వర్గాలు జగన్ కు పెట్టని కోటలుగా ఉన్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలతో ఆ రెండు వర్గాలు జగన్ కు దూరమయ్యారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయం వైసీపీకి వరంగా మారింది. మళ్లీ ఆ రెండు వర్గాలు వైసీపీకి దగ్గరయ్యాయి. చంద్రబాబు కేవలం హిందూ ఓటు బ్యాంకు మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. హిందువులు గంపగుత్తగా ఒకరికే వేసే సీన్ లేదు. దీంతో చంద్రబాబు వేసిన లెక్క తప్పిందని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు బీజేపీ ట్రాప్ లో పడిపోయారని, ఆ పార్టీకి దగ్గరవ్వాలన్న యత్నంలో రెండు వర్గాలను తనకు తానుగానే దూరం చేసుకున్నారంటున్నారు.

Tags:    

Similar News