బాబు అవసరమే బీజేపీకి ఉందట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆయన పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలంగాణలో బీజేపీతో [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆయన పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలంగాణలో బీజేపీతో [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆయన పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందు అడుగు వేయాలని చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తుంది. ఇందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలు వేదిక కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. చంద్రబాబు సామాజికవర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.
పొత్తుకు ముందుకు వస్తే….
ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించే అవకాశాలున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలంటే జనసేన, టీడీపీతో కలసి బరిలోకి దిగితే ఫలితాలు అనుకున్న తరహాలో వస్తాయని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నారు. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయ్యాక జరిగిన తొలి ఎన్నిక దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంతో ఆయన మంచి ఊపు మీద ఉన్నారు. అమిత్ షా స్వయంగా బండిసంజయ్ కు ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపారు.
యాభై వార్డుల్లో ప్రభావం….
ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యక్తిగతంగా టీడీపీని కలుపుకుని వెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే ఉన్నారు. 150 వార్డులున్న గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ దాదాపు యాభై వార్డుల్లో ప్రభావం చేసే అవకాశముందని అంచనాలున్నాయి. దీంతో పాటు జనసేన ప్రభావం కూడా ఉంటుంది. ఈ కలయికతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చన్న ఆలోచనలో బీజేపీ ఉంది.
ఇదే సమయం…..
చంద్రబాబు కూడా బీజేపీకి చేరువవ్వాలనే చూస్తున్నారు. ఏపీలో అది సాధ్యం కావడం లేదు. తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం పార్టీ అసవరం ఉండటంతో ఆ పార్టీయే ప్రతిపాదనను తేవాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ఆ ప్రతిపాదనను తెస్తే అంగీకరించాలని, తక్కువ స్థానాలను తీసుకునైనా పొత్తు కుదుర్చుకోవాలని చంద్రబాబు రాష్ట్ర నేతలకు ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.