బాబు బ్యాలన్స్ తప్పుతున్నారా?
తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఆ పార్టీ అధినేత చంద్రబాబుది కూడా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ఎన్నడూ లేని విధంగా పార్టీ అధినేత వణికిపోతున్నారు. [more]
;
తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఆ పార్టీ అధినేత చంద్రబాబుది కూడా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ఎన్నడూ లేని విధంగా పార్టీ అధినేత వణికిపోతున్నారు. [more]
తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఆ పార్టీ అధినేత చంద్రబాబుది కూడా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ఎన్నడూ లేని విధంగా పార్టీ అధినేత వణికిపోతున్నారు. బ్యాలన్స్ తప్పుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఉంది. చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వాళ్లెవరైనా ఇదే విషయాన్ని చెబుతారు. చంద్రబాబు పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2004 నుంచి 2014 వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదు.
హుందాగా వ్యవహరిస్తారని….
చంద్రబాబు రాజకీయాల్లో హుందాగా వ్యవహరించేవారని పేరుంది. ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన రాష్ట్రానికి సీఈవో అవుతారు. ప్రతిపక్షనేతగా ఉంటే సద్విమర్శలు చేస్తూ అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఇలా నోరు జారలేదు. కానీ ఎందుకో గత ఇరవై నెలల నుంచి చంద్రబాబు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని ఏ1గా సంభోధించడమే కాకుండా నేరగాళ్లని మాట్లాడుతున్నారు.
షర్మిల విషయంలోనూ….
వైఎస్ షర్మిల విషయంలో కూడా చంద్రబాబు లైన్ దాటి మాట్లాడారు. జగన్ వెన్నుపోటు పొడిచారంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనకే వెనక్కు తగిలాయి. రాయలసీమ, తెలంగాణలలో కుటుంబ బాంధవ్యాలు ఎక్కువ. ఉమ్మడి కుటుంబాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకు కన్పిస్తాయి. షర్మిల పార్టీ పెట్టడం వెనక వేరే ఉద్దేశ్యాలు ఏమై ఉన్నప్పటికీ అన్నా, చెల్లెళ్లు దూరమయ్యేంత లేదన్నది పార్టీ నేతలు చెబుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తన వెన్నుపోటు ను జగన్ వైపు మర్చలడానికే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీనేతలు ఎదురుదాడికి దిగారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ చంద్రబాబు రోజూ కేకలు పెడుతున్నా ఆయన చేసిందేమిటన్న ప్రశ్న తిరిగి ఆయనకే తగులుతుంది.
ఎన్నికల ఫలితాలతో….
ఇక పంచాయతీ ఎన్నికలు తనకు అనుకూలంగా ఉంటాయని చంద్రబాబు భావించారు. పెద్దగా గెలవకపోయినా పార్టీ నేతలు ఏకతాటిపైకి వస్తారని ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చంద్రబాబుకు ఆశ్చర్యం కలిగించాయి. అనేక చోట్ల సొంత పార్టీ నేతలు వైసీపీ వారితో కుమ్మక్కయ్యారు. సొంత జిల్లా చిత్తూరులోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అంతా అధికార పార్టీ భయపెట్టి గెలుచుకుందని ఇప్పుడు చెబుతున్నా, చంద్రబాబు కు మాత్రం పార్టీ తన హ్యాండ్ లో లేదన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఏమీ చేయలేక, ఎవరినీ అనలేక బ్యాలన్స్ తప్పుతున్నారు.