బాబు వల్లనే జగన్ గెలిచారట… అవును ఇది నిజం

చంద్రబాబుని అమాయకుడు అని ఎవరైనా అనగలరా. కానీ ప్రతీ మనిషిలోనూ ఉండే అమాయకత్వం పాలు బాబులోనూ ఎంతో కొంత ఉంటుందిగా. చంద్రబాబుకు ప్రచారం యావ ఎక్కువ. పైగా [more]

;

Update: 2021-03-09 09:30 GMT

చంద్రబాబుని అమాయకుడు అని ఎవరైనా అనగలరా. కానీ ప్రతీ మనిషిలోనూ ఉండే అమాయకత్వం పాలు బాబులోనూ ఎంతో కొంత ఉంటుందిగా. చంద్రబాబుకు ప్రచారం యావ ఎక్కువ. పైగా తన మీద తనకు అతి విశ్వాసం. దాంతోనే ఆయన అన్నీ మరచి ఆకాశ వీధుల్లో విహరించారని, ఫలితంగా జగన్ చేతికి ఏపీని అప్పగించేశారని టీడీపీలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటూంటారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ 2019 ఎన్నికల్లో సాధించిన విజయంలో చంద్రబాబు ఫెయిల్యూర్స్ పాత్రే ఎక్కువగా ఉందని కూడా అంటారు.

అదే నిజమా…?

జగన్ 2009 వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. మూడు నెలల ఎంపీగా ఉన్నపుడు తండ్రి వైఎస్సార్ మరణించారు. నాటి నుంచి జగన్ జనంలోకి వచ్చి పోరాటం చేశారు 2014 ఎన్నికల్లో జగన్ కి అధికారం తృటిలో తప్పిపోయింది. దానికి చంద్రబాబు వ్యూహాలు కారణం. అదే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు. జగన్ కి ఏ అనుభవం లేదని చంద్రబాబు చెబితే నమ్మిన జనాలు 2019 ఎన్నికల్లో ఎందుకు నమ్మలేదు. అంటే దానికి కారణం జగన్ కంటే బాబు మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకతే కారణమని చెబుతారు. ఈ మధ్య ఓ టీవీ డిబేట్ లో ఇదే విషయాన్ని టీయారెస్ నేత విశ్లేషిస్తూ వైసీపీ గెలుపులో చంద్రబాబు మీద వ్యతిరేకత కూడా అధిక ప్రాత్ర పోషించింది అని విశ్లేషించి చెప్పారు.

అదే జరిగితే …?

ఈ విశ్లేషణలు కూడా నమ్మదగ్గవిగానే ఉన్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే జగన్ కి ఇక అధికారం కల్ల అనుకున్నారు. అసలే చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. దానికి తోడు అధికారం కూడా చేతిలో ఉంటే ఆయన్ని పట్టడం కష్టమన్న భావన నాడు వినిపించింది. చంద్రబాబు కూడా అదే వూపులో వాస్తవాలను విస్మరించేశారు. తప్పు మీద తప్పు చేసుకుంటూ ముందుకు పోయారు. ఆయన బీజేపీతో పొత్తు తెంచుకోవడం, జనసేనను దూరం చేసుకోవడం రెండూ రాజకీయ పరమైన పెద్ద తప్పులే. ఇక అమరావతి విషయంలో కూడా అతి పెద్ద పొరపాటు బాబు చేశారని చర్చ ఉంది. 2014 నాటి పొత్తులనే కొనసాగిస్తూ ఉన్న నిధులకు సరిపడా ఒక మామూలు రాజధానిని అమరావతిలో నిర్మించి పోలవరాన్ని కేంద్రానికి వదిలేస్తే చంద్రబాబు కచ్చితంగా 2019 ఎన్నికల్లో గెలిచేవారే అని చెబుతారు.

పాఠాలేనా….?

అధికారం ఎపుడూ ఎవరికీ శాశ్వతం కాదు, ఆధునిక కాలంలో నూరేళ్ళు కాపురం చేయాల్సిన భార్యాభర్తల మధ్యనే విభేదాలు వస్తున్నాయి. అందువల్ల క్షణక్షణానికి మారుతున్న జనాల అభిప్రాయాలను బేరీజు వేసుకుని ముందుకు సాగకపోతే మాత్రం చంద్రబాబు మాదిరిగానే ఎవరైనా గద్దె దిగిపోవాల్సిందే అన్నది మేధావుల మాట. జగన్ కూడా బాబు నుంచి ఈ గుణపాఠాలు నేర్చుకుంటేనే బెటర్ అన్న మాట కూడా ఉంది. తనకు జగన్ 151 సీట్లతో పట్టం కట్టారని, తిరుగులేదని కనుక జగన్ భావించి వాస్తవాలని విస్మరిస్తే చంద్రబాబు మాదిరిగా రాజకీయ అమాయకుడిగా మారిపోవడం ఖాయమే అంటున్నారు.

Tags:    

Similar News