ఇదీ ఒకందుకు మంచిదేలే…?
చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నేత కావచ్చు. పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండవచ్చు. కానీ చంద్రబాబు మారితేనే పార్టీ బాగుపడుతుంది. లేకుంటే ఇక టీడీపీ [more]
;
చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నేత కావచ్చు. పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండవచ్చు. కానీ చంద్రబాబు మారితేనే పార్టీ బాగుపడుతుంది. లేకుంటే ఇక టీడీపీ [more]
చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నేత కావచ్చు. పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండవచ్చు. కానీ చంద్రబాబు మారితేనే పార్టీ బాగుపడుతుంది. లేకుంటే ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం వేయాల్సిందే. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ టీడీపీ నేతలే. ఇరవై నెలలుగా చంద్రబాబు ఏం చేశారు? జగన్ ను తిట్టిపోయడం తప్ప. ఎంతసేపు అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తేనే సరిపోదు. ముందు క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నాయకుల్లో విశ్వాసం కల్గించాలి.
ఇరవై నెలలుగా…..
కానీ ఇరవై నెలలుగా చంద్రబాబు ఆ పనిచేయలేకపోయారు. కోడెల శివప్రసాద్ వంటి నేతలే ఆత్మహత్యకు పాల్పడ్డారంటే కిందిస్థాయి నేతలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో చంద్రబాబు గ్రహించలేకపోయారు. ఇక ఆర్థికంగా టీడీపీ నేతలు తీవ్రంగా నష్టపోయారు. తాను అధికారంలో ఉండగా చేసిన కాంట్రాక్టు పనులు, ఎన్జీఆర్ఐ పనులకు సంబంధించిన బిల్లులను చంద్రబాబు చెల్లించకుండా పక్కన పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలిపేశారు.
ఒక రకంగా…..
దీంతో క్యాడర్ ను నడిపించేందుకు నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఒకరకంగా చంద్రబాబుకు ఇది మంచిదేనని చెప్పాలి. ఇప్పుడు ఏమాత్రం కొద్ది సంఖ్యలో సీట్లను గెలిచినా తన నాయకత్వంపై నాయకులకు, ప్రజలకు విశ్వాసం ఉందన్న భ్రమల్లో చంద్రబాబు 2024 వరకూ ఉండిపోయేవారు.
తాను మారి.. వారిని మార్చి…..
కానీ ఇప్పుడు ఓటమి చంద్రబాబుకు ఒక గుణపాఠంగా చెప్పాలి. తన పార్టీ ఇంత దయనీయస్థితికి చేరుకోవడానికి గల కారణాలను రూట్ లెవల్లో అధ్యయనం చేయాలి. వైసీపీపై నిందలు మోపితే సరిపోదు. తన లోపాలను సరిదిద్దుకుంటేనే భవిష్యత్ ఉంటుంది. లేకుంటే బాబు రొద్దకొట్టుడు మానుకోకుండా హైదరాబాద్ ను నేనే కట్టాను, జగన్ అవినీతి పరుడు, ఫ్యాక్షనిస్టు, తనకు తప్ప ఎవరికీ పాలన చేతకాదు, జగన్ దేనికీ పనికిరాడు అంటూ పోతే ఇవే ఫలితాలు 2024లో కూడా రాకమానవు. కాబట్టి చంద్రబాబు మారి, అందరినీ మార్చగలిగితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు మేలుచేసినట్లే. మారకుంటే ఇక అంతే సంగతులు.